TG: నిర్మల్ జిల్లాలో బీసీ గురుకుల విద్యార్థి మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్ధి మృతిపై నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్ధి అయాన్ హుస్సేన్ కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం, కుటుంబంలోని ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ప్రకటించారు. కాగా.. అయాన్ అనే బాలుడు ఇవాళ ఉదయం పాఠశాల ఆవరణలో గేమ్స్ ఆడుకుంటూ అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే.