AP: ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్స్పో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. గత ప్రభుత్వం పరిశ్రమలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్లలో అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లాయని తెలిపారు. గత ఐదేళ్లలో వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక విధానంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.