రకరకాల ఎలర్జీలు, దుమ్ము, ధూళి, థైరాయిడ్ వంటి సమస్యల వల్ల కళ్లు పొడిబారిపోతాయి. అలాంటప్పుడు కళ్లలో దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కళ్లు పొడిబారకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. స్క్రీన్ వాడుతున్నప్పుడు మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ వాడాలి.