AP: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనేది పచ్చి నిజం అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమలకు జగన్ వెళ్తే.. దేవుడిపై నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరే వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి.. అపచారం చేశారని గుర్తుచేశారు. తప్పుల మీద తప్పులు చేసి.. మళ్లీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దయచేసి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని సూచించారు.