TG: HYDలోని మూసీ నివాసిత ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ బాధితుల వివరాల సేకరణకు అధికారులు రంగంలోకి దిగారు. మూసీ రివర్ బెడ్లో 25 ప్రత్యేక బృందాలు సర్వే చేస్తున్నాయి. ఒక్కో టీమ్‌లో తహసీల్దార్‌తోపాటు ఐదుగురు ఆఫీసర్లు వివరాలు సేకరించి 2,166 ఇళ్లను గుర్తించారు. FTL నిర్మాణాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, బఫర్ జోన్లో నిర్మాణాలకు ఇళ్లతోపాటు నష్టపరిహారం చెల్లించనున్నారు.