AP: ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు ఇవాళ సచివాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు విధాన రూపకల్పన చేయనున్నారు. అయితే ఐటీ కంపెనీల స్థాపనకు ప్రోత్సహకాలు ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ హబ్ కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.