Rahul Gandhi : నిజమైన త్యాగం మా వారసత్వం : రాహుల్
గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్ చేస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరిస్తూ చేసిన ఆవేశభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన బయోని డిస్ క్వాలిఫైడ్ ఎంపీ గా మార్చుగా విషయం తెలిసిందే.
గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్ చేస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరిస్తూ చేసిన ఆవేశభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన బయోని డిస్ క్వాలిఫైడ్ ఎంపీ గా మార్చుగా విషయం తెలిసిందే. 2019 పరువు నష్టం కేసులో రాహుల్‌పై లోక్ సభ సెక్రటేరియట్ ఎంపీగా అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ (Congress) పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘సంకల్ప్ సత్యాగ్రహ’ (Sankalp Satyagraha) దీక్షలు చేపట్టింది.
ఢిల్లీ (Delhi) లోని రాజ్‌ఘాట్ (Rajghat) వద్ద చేపట్టిన దీక్షలో ప్రియాంక గాంధీ పాల్గొని మాట్లాడారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అంత్యక్రియల సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని మోస్తూ రాహుల్ ఆర్మీ ట్రక్కు వెనుక నడిచిన సంఘటనను గుర్తు చేస్తూ ప్రియాం ఆవేశపూరిత ప్రసంగం చేశారు.‘32 ఏళ్ల క్రితం, మా నాన్న (రాజీవ్ గాంధీ) మృతదేహం అంత్యక్రియల కోసం తీన్‌మూర్తి భవన్ నుంచి బయలుదేరుతోంది. మృతదేహాన్ని మోస్తూ రాహుల్ నడి ఎండలో ఆర్మీ ట్రక్కు వెనకే నడిచారు. అప్పుడు మా నాన్న మృతదేహానికి త్రివర్ణ పతాకం (Tricolor flag) చుట్టారు.
కానీ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మా నాన్నను మీరు అవమానించారు. ఇప్పుడు ఆ అమరవీరుడి కుమారుడిని దేశద్రోహి అంటున్నారు. అతని దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు. నెహ్రూ (Nehru) ఇంటిపేరును ఈ కుటుంబం ఎందుకు ఉపయోగించలేదని పార్లమెంటులో ప్రధాని ఎద్దేవా చేశారు. అలా ప్రశ్నించి మీరు మా మొత్తం కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని అవమానించారు’ అని ప్రియాంక తెలిపారు. ఈ వీడియో షేర్ చేసిన రాహుల్.. ‘నిజం, ధైర్యం, త్యాగం – ఇది మా వారసత్వం. ఇదే మా బలం కూడా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.