»Travel Within 12 Minutes Modi Started And Journey Namo Bharat Mini Bullet Train
Namo Bharat: 12 నిమిషాల్లోనే ప్రయాణం..నమో భారత్ మిని బుల్లెట్ ట్రైన్ షురూ
దేశంలో వందే భారత్ ట్రైన్ ను మించిన ట్రైన్ తాజాగా మరొకటి ప్రారంభమైంది. దీనిని ప్రస్తుతం సాహిబాబాద్, దుహై ప్రాంతాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి, ఇందులో ప్రయాణించారు. ఈ మిని బుల్లెట్ ట్రైన్లో ఈ ప్రాంతాల మధ్య కేవంల 12 నిమిషాల్లో ప్రయాణించడం విశేషం.
Travel within 12 minutes modi started and journey Namo Bharat Mini Bullet Train
దేశంలో గత అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేగవంతమైన రైలు ఇప్పుడు పట్టాలపై పరుగులు పెట్టడం ప్రారంభించింది. శుక్రవారం సాహిబాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ(modi) జెండా ఊపి నమో భారత్ రైలును(NamoBharatRapidRail) ప్రారంభించారు. శనివారం నుంచి ప్రజలు ఇందులో ప్రయాణించవచ్చు. ప్రారంభోత్సవానికి ముందు దాని పేరు కూడా మార్చబడింది. దేశంలోనే తొలి మినీ బుల్లెట్ రైలు ఇకపై ‘నమో భారత్’గా పిలవబడుతుంది. ప్రస్తుతం ఈ రైలు ఢిల్లీ-మీరట్ మధ్య ఈ మార్గంలో 17 కిలోమీటర్లు మాత్రమే నడుస్తుంది. సాహిబాబాద్, దుహై మధ్య 5 స్టేషన్ల గుండా ప్రయాణం చేయనుంది.
ఈ నమో భారత్ ర్యాపిడ్ రైలు గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్ల వరకు ఉంటుందని రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇది గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రైలు సగటు వేగం గంటకు 100 కిలోమీటర్లు ఉంటుంది. దీంతో ప్రస్తుతం నమో భారత్ దేశంలో అత్యంత వేగంగా నడుస్తున్న రైలుగా నిలిచింది. వందే భారత్(vande bharat) స్పీడ్ గరిష్ట వేగం ప్రస్తుతం గంటకు 130 కిలోమీటర్లు. అయితే వందేభారత్ కూడా గంటకు 180 కి.మీ వేగంతో నడిచేలా డిజైన్ చేయబడటం విశేషం.
ఈ రైలు 5 స్టేషన్లలో ప్రయాణిస్తుంది. వీటిలో సాహిబాద, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపో స్టేషన్లు ఉన్నాయి. అయితే ఢిల్లీ నుంచి మీరట్ వరకు మొత్తం 25 స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తర్వాత మొదలు కానుంది. వాటిలో 4 భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. సరాయ్ కాలే ఖాన్, న్యూ అశోక్ నగర్, ఆనంద్ విహార్, జంగ్‌పురా, సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధర్, దుహై, దుహై డిపో, మురాద్‌నగర్, మోడీనగర్ సౌత్, మోడీనగర్ నార్త్, మీరట్ సౌత్, పార్తాపూర్, రితాని, శతాబ్దినగర్, బ్రహ్మపురి, మీరట్ సెంట్రల్, భైంసాలీ, బేగంపుల్, MES కాలనీ, దౌరాలా మెట్రో, మీరట్ నార్త్, మోడీపురం, మోడీపురం డిపో ఉన్నాయి.
అంతేకాదు దేశంలోనే అత్యంత వేగవంతమైన ఈ హైటెక్ రైలులో ఛార్జీలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. రైలులో స్టాండర్డ్, ప్రీమియం అనే రెండు రకాల కోచ్‌లను ఏర్పాటు చేశారు. రెండు తరగతులకు కూడా ఛార్జీలు భిన్నంగా ఉన్నాయి. స్టాండర్డ్ కోచ్‌లో ఛార్జీ కనిష్టంగా రూ.20 నుంచి గరిష్టంగా రూ.50 వరకు ఉంది. ఉదాహరణకు షాహిబాబాద్ నుంచి గుల్ధార్కు లేదా ఘజియాబాద్ నుంచి గుల్ధార్కు వెళ్లడానికి, మీరు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అయితే సాహిబాబాద్ నుంచి దుహై డిపోకు వెళ్లడానికి ఛార్జీ రూ.50 ఉంటుంది. ఇక ప్రీమియం తరగతిలో కనీస ధర రూ.40 కాగా.. గరిష్టంగా రూ.100 ఉంది. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లో భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టిఎస్) 17 కి.మీ పొడవును ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. 82.15 కి.మీ ఢిల్లీ-మీరట్ RRTS కారిడార్‌లో, సాహిబాబాద్, దుహై డిపో మధ్య 17 కిమీ ప్రస్తుతం శనివారం ప్రజలకు అందుబాటులోకి రానుంది.