తల్లి అయ్యే భాగ్యం ఒక్క మహిళకే ఉంటుంది. ఇంకెవ్వరికీ ఆ భాగ్యం దక్కదు. తల్లి అవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ.. అమ్మ అని పిలిపించుకోలేరు. కానీ.. కేరళకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ జంట మాత్రం తల్లిదండ్రులు కాబోతున్నారు. ఒక హిజ్రా తల్లి కాబోతుంది అనే విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
జియా పావల్, జహద్ పావల్.. ఇద్దరిదీ కేరళలోని కోజికోడ్. ఇద్దరూ ట్రాన్స్‌జెండర్సే. తాము తల్లిదండ్రులం కాబోతున్నాం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మార్చ్‌లో తమ బిడ్డ ఈ భూమ్మీద అడుగుపెట్టబోతున్నట్టు వాళ్లు వెల్లడించారు. జియా అబ్బాయిగా పుట్టాడు. కానీ.. తర్వాత అమ్మాయిగా తన శరీరాన్ని మార్చేసుకున్నాడు. హిజ్రాగా మారిపోయాడు. కానీ.. జహద్ మాత్రం అమ్మాయిగా పుట్టినా తర్వాత అబ్బాయిగా మారిపోయాడు. ఇప్పుడు ఆ జహదే గర్భం దాల్చింది. గత మూడేళ్ల నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. జియా అబ్బాయి నుంచి అమ్మాయిగా మారే ముందే.. జహద్తో కలిశాడు. జహద్ పుట్టడమే అమ్మాయిగా పుట్టింది కాబట్టి.. తను గర్భం దాల్చింది. కానీ.. జహద్ వేషధారణ మాత్రం చూడటానికి అబ్బాయిలాగానే ఉంటుంది. తనకు గర్భం రావడం వల్ల.. తను అబ్బాయిలా మారాడు కానీ.. తన ప్రైవేట్ పార్ట్స్‌ను డాక్టర్స్ అలాగే ఉంచారు.
నేను పుట్టుకతో అమ్మాయిని కాదు కానీ.. నా మనసులో ఎప్పుడూ ఒక అమ్మాయికి ఉండే ఆలోచనలే నిండి ఉంటాయి. నేను ఎప్పుడూ ఒక తల్లిని కావాలని తపించేదాన్ని. కానీ.. నేను పుట్టుకతో అబ్బాయిని కదా. అది సాధ్యం కాదు అనుకున్నా కానీ.. జహద్ వల్ల నాకు అది సాధ్యం అయింది. కాలమే మమ్మల్ని కలిపింది. మూడేళ్లు అవుతుంది. నా కల కూడా త్వరలో నెరవేరబోతోంది.. అంటూ జియా సోషల్ మీడియాలో ఓ నోటు రాసుకొచ్చింది.
అయితే.. జహద్ డెలివరీ అయితే జహద్ చరిత్రలో నిలిచిపోతాడు. బిడ్డకు జన్మనిచ్చిన తొలి మగ ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. ఇప్పటికే గర్భం దాల్చిన తొలి మగ ట్రాన్స్‌జెండర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.