మహారాష్ట్రలోని నాగపూర్ (Nagpur) లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.తాను అడిగినట్లు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి (Gadkari) హాని తప్పదని కాల్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. నాగ్‌పూర్‌లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది
మహారాష్ట్రలోని నాగపూర్ (Nagpur) లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాను అడిగినట్లు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి (Gadkari) హాని తప్పదని కాల్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. నాగ్‌పూర్‌లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది. కాగా ఈ ఏడాది జనవరిలో నితిన్ గడ్కరీ నివాసానికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తాను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్(Dawood Ibrahim gang) సభ్యుడినని చెబుతూ రూ. 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గడ్కరీ పీఆర్ కార్యాలయానికి జనవరి 14న మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు మంత్రి నివాసంతో పాటు కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాలర్‌ను జయేష్ పూజారిగా (Jayesh as a priest) గుర్తించారు.
తన డిమాండ్ నెరవేర్చకుంటే బాంబుతో మంత్రికి హాని తలపెడతానని అతడు బెదిరించాడు. జయేష్ పూజారి హిందల్గ జైలు ఖైదీ అని, గతంలో ఓ హత్య కేసులో కోర్టు అతడికి మరణ శిక్ష విధించిందని దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు గడ్కరీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్స్ పెడుతున్న వ్యక్తిపై నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు (police)గడ్కరీ ఆఫీసుకు చేరుకుని విచారణ ప్రారంభించారు. జయేష్ పేరుతో ఈ కాల్స్ చేసినట్లు డీసీపీ రాహుల్ (DCP Rahul) తెలిపారు. బెదిరింపు కాల్స్ వచ్చిన నెంబర్ మంగళూరులో ఒక మహిళ పేరుతో ఉన్నట్లు, ఆమెకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆమె ఆ ఫోన్ కాల్స్ చేయలేదని, ఎవరు చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు (police) చెప్పారు