రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆసుపత్రికి తాళం వేసి, రోడ్డు పైన పానీ పూరి బండి పెట్టుకున్న ఆశ్చరకర సంఘటన జరిగింది. ఈ బండి పైన ప్రయివేటు డాక్టర్ అని కూడా రాసి ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే సదరు మహిళా డాక్టర్ పానీ పూరీ బండి పెట్టుకున్న పక్కనే మిగతా సిబ్బంది టీ దుకాణం పెట్టి విక్రయిస్తున్నారు.
రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆసుపత్రికి తాళం వేసి, రోడ్డు పైన పానీ పూరి బండి పెట్టుకున్న ఆశ్చరకర సంఘటన జరిగింది. ఈ బండి పైన ప్రయివేటు డాక్టర్ అని కూడా రాసి ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే సదరు మహిళా డాక్టర్ పానీ పూరీ బండి పెట్టుకున్న పక్కనే మిగతా సిబ్బంది టీ దుకాణం పెట్టి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి సంఘటనలు కేవలం సికార్ జిల్లాలోనే కాదు… రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లోను కనిపిస్తున్నాయి. చాలమంది ప్రయివేటు ఆసుపత్రుల డాక్టర్లు, సిబ్బంది రోడ్ల పైన పానీ పూరీ, చాయ్ విక్రయిస్తూ కనిపిస్తున్నారు. అయితే వీరు బతుకు దెరువు కోసమో… డబ్బు సంపాదన కోసమో చేయడం లేదు. రాజస్థాన్ ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా ఈ వైద్యులు ఇలా నిరసన తెలుపుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన షాక్ తో ప్రయివేటు ఆసుపత్రులకు ఆయా డాక్టర్లు, సిబ్బంది తాళాలు వేసి, సిబ్బందితో పాటు ఆసుపత్రి వైద్యులు రోడ్ల పైకి వచ్చి వినూత్న రీతులో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇటీవలే ఓ ఆరోగ్య బిల్లుకు తీసుకు వచ్చింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సీకార్కు చెందిన డాక్టర్ అనిత అనే వైద్యురాలు.. వినూత్నంగా నిరసన చేపట్టారు. దీక్షలు, ఆందోళనలు చేయకుండా.. తన ఆసుపత్రికి తాళం వేసి.. అక్కడే పానీపూరీ అమ్ముతున్నారు. ఆసుపత్రి బోర్డు తీసేసి ‘అనిత పుచ్కావాలీ’ అని పానీపూరి దుకాణం బోర్డు పెట్టారు. ఆమెతో పాటు అక్కడ పని చేసే సిబ్బంది పక్కనే టీ అమ్ముకుంటూ కనిపించారు. వేలాది మంది డాక్టర్లు రోడ్డుపై ఇలా వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు.
మరో డాక్టర్ కూడా తన ఆసుపత్రిని పరోఠా కేంద్రంగా మార్చారని డాక్టర్ అనిత తెలిపారు. ప్రయివేటు ఆసుపత్రుల ఆందోళన కొనసాగుతుండగానే ‘రైట్ టూ హెల్త్’ బిల్‌ను ఆమోదించింది రాజస్థాన్ ప్రభుత్వం. దీని వల్ల రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఏ ఆసుపత్రిలో అయినా అత్యవసర చికిత్స చేయించుకోవచ్చు. కానీ ఈ బిల్లును రాష్ట్రంలోని ప్రయివేటు ఆసుపత్రులు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టం పేరుతో రాజస్థాన్ ప్రభుత్వం ప్రయివేటు ఆసుపత్రుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తున్నాయి. తక్షణమే ‘రైట్ టూ హెల్త్’ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులు నిరసనలు చేపడుతున్నారు.