»The Central Government Will Organize The Program Mahajan Sampark Abhiyan
BJP: నేటి నుంచి ప్రజల ఆశీర్వాదం కోసం బీజేపీ ‘మహాజన్ సంపర్క్ అభియాన్’
ప్రధాని మోడీ(PM Modi) తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు వివరిస్తూ దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్లు చేపట్టేం దుకు బీజేపీ(BJP) సన్నద్ధం అవు తోంది. నేటి నుంచి నెల రోజుల పాటు పార్లమెంట్(Parliament), అసెంబ్లీ నియో జకవర్గాల స్థాయిలతో పాటు మండల, శక్తి, బూత్ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తుంది.
BJP: ప్రధాని మోడీ(PM Modi) తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు వివరిస్తూ దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్లు చేపట్టేం దుకు బీజేపీ(BJP) సన్నద్ధం అవు తోంది. నేటి నుంచి నెల రోజుల పాటు పార్లమెంట్(Parliament), అసెంబ్లీ నియో జకవర్గాల స్థాయిలతో పాటు మండల, శక్తి, బూత్ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తుంది. ప్రజలకు ప్రధాని చేస్తున్న సేవలను వివరించి మరోసారి ఆశీర్వదించేందుకు ‘మహాజన్ సంపర్క్ అభియాన్'(mahajan sampark abhiyan) పేరుతో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అందులో భాగంగా మంగళవారం నుంచి జూన్ 30 వరకు నెల రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
అందులో భాగంగానే దేశవ్యాప్తంగా 51 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ(BJP) పార్టీ నిర్ణయించింది. అంతేకాదు లోక్ సభ(LOK sabha) స్థాయిలో మొత్తం 396 సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. కాగా, దేశవ్యాప్తంగా 51 బహిరంగ సభలు నిర్వహిస్తుండగా, తెలంగాణలో రెండు సభలు జరగనున్నాయి. జన్ సంపర్క్ అభియాన్ సన్నాహాల కోసం బీజేపీ ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యవర్గ సమావేశాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా 117 క్లస్టర్(Cluster) బృందాలను నియమించారు. రాష్ట్ర స్థాయిలో ఏడుగురు, జిల్లా స్థాయిలో ఆరుగురు, మండల స్థాయిలో నలుగురు సభ్యులతో కమిటీలు వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించి బీజేపీ(BJP) వైపు ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించారు.