Tamilnadu : తమిళనాడులోని విరుదునగర్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ మృతుల్లో మహిళలు కూడా ఉన్నారని, పేలుడుకు గల కారణాలను కనుగొనే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిపారు. విరుదునగర్ జిల్లాలో శనివారం పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని విరుదునగర్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించగా, మరో 3 మంది గాయపడ్డారని పోలీసులు సమాచారం ఇచ్చారు. విరుదునగర్ జిల్లాలో శనివారం పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన వెంబకోట్టై పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలా సార్లు బాణాసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించి ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లింది.