రామేశ్వరం అనగానే మనకు గుర్తొచ్చేది పంబన్ బ్రిడ్జి. అది రైల్వే సస్పెన్షన్ బ్రడ్జి. సముద్రంలో ఉండే ఆ బ్రిడ్జి మీదుగా రైలు వెళ్తుంటే చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదే ట్రెయిన్లో బ్రిడ్జి మీద ప్రయాణం చేయడం కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే.. ఆ పంబన్ బ్రిడ్జి కింది నుంచి కేవలం నావీ వాళ్ల షిప్‌లనే ఇప్పటి వరకు పంపించేవారు. కానీ.. తాజాగా ఫిషింగ్ బోట్స్‌ను కూడా పంపిస్తున్నారు. ఆ బ్రిడ్జిని దాటి సముద్రం లోపలికి వెళ్లి చేపలను పట్టుకునేలా బోట్లకు అధికారులు తాజాగా అనుమతి ఇచ్చారు. దీంతో ఇవాళ ఒకేసారి 50 చేపల బోట్లు బ్రిడ్జిని దాటి సముద్రం లోపలికి వెళ్లాయి. దానికి సంబంధించిన వీడియో ఇదే.
#WATCH | Tamil Nadu: The suspension Railway Bridge in Pamban opened for fishing boats in Rameswaram. More than 50 fishing boats crossed the bridge. pic.twitter.com/GRVZUrPO05