»Sonia Gandhi Is Against Freezing Congress Bank Accounts
Sonia Gandhi: కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయడంపై సోనియా అగ్రహం
పార్టీని ఆర్థికంగా దెబ్బకొట్టడానికే కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడమే అని పేర్కొన్నారు.
Sonia Gandhi is against freezing Congress bank accounts
Sonia Gandhi: కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రనేత సోనియా గాంధీ అన్నారు. భారతీయ జనతా పార్టీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై గురువారం విరుచుకుపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై సీనియర్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమస్య చాలా తీవ్రమైనదని, “తమ పార్టీకే కాదు, దేశ ప్రజాస్వామ్యానికే నష్టం” అని వెల్లడించారు.
“ఇది మన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం గురించి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడం అని అన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా తాము ఉన్నారని పేర్కొన్నారు. తాము ఎలాంటి ప్రకటనలు కానీ తమ నాయకులను ఎక్కడి పంపలేదని వెల్లడించారు. ఇది మన ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడం కాకపోతే ఇంకేముంటుంది అని రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, 210 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ వివాదానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ తన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన చర్యపై I-T డిపార్ట్మెంట్ నుండి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సంవత్సరాలుగా ఆదాయపు పన్ను బకాయిలు చెల్లించని వారిపై చర్యలు తీసుకున్నాము అని అధికారిక వర్గాలు తెలిపారు.
బ్రీఫింగ్ సందర్భంగా సోనియా గాంధీ తమ బ్యాంకు ఖాతాల నుంచి బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు.‘‘కొన్ని కంపెనీల నుంచి బీజేపీ డబ్బులు ఎలా తీసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుగుతున్నతది అని త్వరలోనే నిజం మన ముందుకు వస్తుందని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున మాట్లాడుతూ.. రాజ్యాంగ సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు కావాలంటే, వారు మన బ్యాంకు ఖాతాలను స్వేచ్ఛగా యాక్సెస్ చేయడానికి అనుమతించాలి. ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి ఏ రాజకీయ పార్టీ రాదని ఖర్గే అన్నారు.