కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం దేశంలో జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణలో యాత్ర పూర్తి చేసుకున్న ఆయన… మహారాష్ట్రలోకి అడుగుపెట్టారు. కాగా… తెలంగాణలో పర్యటిస్తున్న సమయంలో.. గిరిజనుల ప్రత్యేక వంటకం బొంగు చికెన్ ని ఆయన స్వయంగా వండటం విశేషం. ఆయన వంటకం గిరిజనులతో మాట్లాడుతూ వారి దగ్గర నేర్చుకొని.. ఆతర్వాత రుచి చూసిన వీడియోని కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ లో షేర్ చేయగా…. అది కాస్త వైరల్ గా మారింది.
రాహుల్ గాంధీ స్వయంగా చికెన్ తయారీలో సహకరించారు. పచ్చి మాంసంలో మసాలా కలిపారు. బొంగులో చికెన్ దట్టించారు. ప్రత్యేకంగా తయారు చేసిన పొయ్యిపై ఉంచారు. చికెన్ ఉడుకుతున్న సమయంలో గిరిజన మహిళలతో కలిసి డాన్స్ చేశారు. అనేక సందేహాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. ముత్యాలమ్మ జాతర సందర్భంగా బొంగు చికెన్ తయారు చేస్తామని గిరిజన మహిళలు రాహుల్‌కి చెప్పారు.
ఉదయం లేచిన దగ్గర నుంచి వ్యవసాయ పనులతో పాటు అనేక పనులు చేస్తుండడంతో తమ శరీరం బలంగా తయారయిందని ఓ గిరిజన మహిళ రాహుల్‌కి తెలిపింది.
రాహుల్ గాంధీ కొంత సేపు కాంగ్రెస్ నేతలతో కలిసి ఓ చోట కూర్చున్నారు. చికెన్ ఉడికే వరకు సరదాగా వారితో ముచ్చటించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అభినందించారు. యాత్రా ఏర్పాట్లు బాగా చేశారని ప్రశంసించారు.