Prakash Raj: వాలంటైన్స్ డేని ఉత్సాహంగా జరుపుకోవాలని చాలా మంది ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే... ఆ రోజున వాలంటైన్స్ డే కాకుండా.. గో ప్రేమికులు అందరూ కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది.
Prakash Raj: వాలంటైన్స్ డేని ఉత్సాహంగా జరుపుకోవాలని చాలా మంది ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే… ఆ రోజున వాలంటైన్స్ డే కాకుండా.. గో ప్రేమికులు అందరూ కౌ హగ్ డే జరుపుకోవాలని కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది.
భారతదేశ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవు వెన్నెముక లాంటిది కాబట్టి ఆవును ‘కామధేనువు’, ‘గోమాత’గా పేర్కొంటారని చెప్పుకొచ్చింది. ‘భారతీయులు పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడిపోవడం వల్ల దేశంలో వైదిక సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని, ఆవును కౌగిలించుకుంటే వ్యక్తిగత, సామూహిక ఆనందం పెరుగుతుంది కాబట్టి గోవులను కౌగిలించుకోవాలని వాలెంటైన్స్ డే కాకుండా కౌ హగ్ డేని జరుపుకోవాలని కోరుతున్నాం అని బోర్డు కార్యదర్శి ఎస్.కె.దత్తా పిలుపునిచ్చారు.
అయితే… దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు కేంద్ర ఆలోచనను మెచ్చుకుంటుంటే కొందరు విమర్శిస్తున్నారు. కాగా… తాజాగా దీనిపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా సెటైరికల్ గా స్పందించడం గమనార్హం.
మ్యాటరేంటంటే… గతంలో జీవీఎల్ నరసింహారావును ఒక ఆవు తన్నబోయిన వీడియోను ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేయగా దాని మీద ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆవు కూడా బహుశా తన ప్రియమైన వారి కోసం ఎదురుచూస్తోంది ఏమో అని అంటూ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ వెటకారంగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.