»Pm Modi Degree Case Arvind Kejriwal Made Mockery Of Rti Act Gujarat High Court Says
Kejriwal కామెంట్స్.. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్స్ వివాదం… !
Kejriwal : ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదం పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు పై ఆయన స్పందించారు. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు మరిన్ని సందేహాలకు తావిచ్చేలా ఉందని ఆయన అన్నారు.
డిగ్రీ సర్టిఫికేట్ అడిగితే ఉలుకెందుకని ప్రశ్నించారు. మోడీ డిగ్రీ సర్టిఫికేట్ నకిలీవేమోననే అనుమానం కలుగుతోందని, ఈ అనుమానానికి కారణం కోర్టు తీర్పేనని చెప్పారు. దీంతోపాటు మరెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ప్రధాని మోడీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్ వివరాల కోసం కేజ్రీవాల్ గతంలో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కి లేఖ రాశారు.
ఆర్టీఐ చట్టం ప్రకారం మోడీ విద్యార్హతల వివరాలు వెల్లడించాలని కోరారు. దీంతో అప్పటి సీఐసీ ఎం.శ్రీధర్ ఆచార్యులు.. ఈ వివరాలు వెల్లడించాలని గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై గుజరాత్ వర్సిటీ కోర్టుకెక్కింది. తాజాగా విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు.. ప్రధాని డిగ్రీలను చూపనక్కర్లేదంటూ తీర్పు వెలువరించింది. అంతేకాదు, ఈ పిటిషన్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా విధించింది.