రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన చంపై సోరెన్ శుక్రవారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు మంత్రులు అలంగీర్ ఆలం, సత్యానంద్ భోక్తా కూడా ప్రమాణస్వీకారం చేశారు.
జ్ఞాన్‌వాపిలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టులో వారికి ఎదురు దెబ్బ తగిలింది. వ్యాస్ నేలమాళిగలో పూజ కొనసాగుతుంది.
మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఐదో సారి సమన్లు పంపించింది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
భూకుంభకోణం కేసుకు సంబంధించి డైరక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మాజీ సీఎం హేమంత సోరెన్‌ను అరెస్ట్ చేస్తే.. తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించారు. అయితే.. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు బాగా బలపడతాయి అని అందరూ కానీ.. రివర్స్ అయ్యింది. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అలా నష్టాల్లో ముగియడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...
రామాయణం ఆధారంగా ఎన్ని సీరియల్స్, సినిమాలు వచ్చినా.. ఆ పేరు చెప్పగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది రామానంద్ సాగర్ 'రామాయణం' సీరియల్.
కాశీ విశ్వనాథ్ ఆలయ నిర్వాహకులు జ్ఞానవాపి మసీదులోని వ్యాస్ జీ బేస్‌మెంట్‌లో ఆరతి, పూజలకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను విడుదల చేశారు. ఉదయం 3.30 గంటలకు మంగళ హారతితో ప్రారంభమయ్యే వ్యాస్ నేలమాళిగలో రోజూ ఐదు హారతులు ఉంటాయి.
దేశంలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ రైస్ అనే పేరుతో కిలో బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకు ప్రయత్నించారు. ఈసారి కూడా తన మహిళా శక్తిని బలోపేతం చేసుకునేందుకు యథావిధిగా కసరత్తు చేశారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే తన అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మధ్యంత బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై ఎటువంటి మార్పు లేదు. అయితే ప్రత్యక్ష పన్నుపై కొంత మార్పులు చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రాబోవు ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ రైతులకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర కేబినెట్ ఈరోజు సమావేశమైంది. భేటీలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.