భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే తన అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Hemanth Soren: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు కోర్టు విచారణ జరపనుంది. అరెస్టుకు ముందు రాష్ట్ర ప్రజలు, పార్టీ నేతలను ఉద్దేశించి సోరెన్ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట ఆ వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | Former Jharkhand CM Hemant Soren before his arrest by ED yesterday said, "Most probably ED will arrest me today, but I am not worried as I am Shibu Soren's son…After a full day of questioning, they decided to arrest me in matters which are not related to me. No… pic.twitter.com/8c3b19yyOL
ఈడీ నన్ను అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి నేనేమీ బాధపడటం లేదు. ఎందుకుంటే నేను శిబుసోరెన్ కుమారుడిని. రోజంతా ప్రశ్నించిన తర్వాత నాకు సంబంధంలేని కేసులో అధికారులు అరెస్టు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. వాళ్లు ఎలాంటి ఆధారాలను గుర్తించలేదు. ఢిల్లీలోని నివాసంలో సోదాలు నిర్వహించి నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. పేదలు, ఆదివాసీలు, దళితులు, అమాయక ప్రజలపై అరాచకాలకు పాల్పడే వారిపై ఇప్పుడు సరికొత్త పోరాటం చేయాల్సి ఉందని సోరెన్ వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.