»Housing Scheme For Middle Class Construction Of 2 Crore Houses Budget 2024
Budget 2024: మధ్య తరగతి కోసం హౌసింగ్ స్కీమ్… 2 కోట్ల ఇళ్లు నిర్మాణం
ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రాబోవు ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.
Budget 2024: సోంతింటి కోసం పాటుపడే మధ్య తరగతి ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకోవాలి అనుకునే వారికి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ కింద కోటికి పైగా ఇళ్ల నిర్మానం జరిగిందని కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్(Nirmala Sitharaman) పేర్కొన్నారు. ఈ పథకం కోవిడ్ సమయంలో కొనసానగిందని వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్(PM Awas Yojana Gramin) కింద మూడు కోట్ల ఇంటిని నిర్మించాలనే లక్ష్యాన్ని త్వరలనే చేరుకుంటామని పేర్కొన్నారు.
బస్తీలలో, అద్దె ఇళ్లలో విసిగిన ప్రజలకు సొంతిళ్లు కట్టివ్వాలనే లక్ష్యంతో రాబోవు ఐదేళ్లలో 2 కోట్ల ఇల్లను నిర్మించబోతున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కేంద్రం మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 300 యూనిట్ల సోలర్ కరెంట్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని మోడీ రూప్‌టాప్ సోలారైజేషన్ స్కీమ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఆదా అవుతున్నట్లు నిర్మాలా సీతారామన్(Nirmala Sitharaman) తెలిపారు.