లక్నో జిల్లా జైలులో డిసెంబర్ 2023లో నిర్వహించిన ఆరోగ్య పరీక్షలో 36 మంది ఖైదీలకు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న మొత్తం హెచ్‌ఐవీ పాజిటివ్ ఖైదీల సంఖ్య 63కు చేరుకుందని జైలు అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది జరిగే మహా కుంభానికి బడ్జెట్‌లో రూ.2600 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల సంఘం సోమవారం (ఫిబ్రవరి 5) రాజకీయ పార్టీలను పోస్టర్లు, కరపత్రాలతో సహా ఎలాంటి ప్రచార సామగ్రిలో పిల్లలను ఏ రూపంలోనైనా ఉపయోగించవద్దని కోరింది.
జ్ఞానవాపి కేసు తర్వాత హిందూ పక్షం మరో పెద్ద విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో లక్షగృహ, బద్రుద్దీన్ షా సమాధికి సంబంధించి 50 ఏళ్లుగా వివాదం నడుస్తోంది.
అవివాహిత యువతికి అబార్షన్ చేసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. ఆమె 28 వారాల గర్భవతి. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తెలిపారు.
బీజేపీ తీర్థం పుచ్చుకుంటే చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు మా పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన బీజేపీ ఇప్పుడు తనను కూడా ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. తప్పు చేసిని వారు బీజేపీకి భయపడుతారేమో కానీ తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు.
కోతులను కరిచిన కీటకాలు మళ్లీ మనిషిని కుడితే మంకీ ఫీవర్ వ్యాధి సోకుతుందని డాక్టర్లు తెలిపారు. దీనివల్ల కర్ణాటకలో ఇద్దరు మరణించారు.
‘డైవర్సిఫైడ్ కాంగ్లమరేట్స్’ విభాగంలో అంబానీ తొలిస్థానం దక్కించుకున్నారు. దీంతో ఆయన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
దేశంలోని రెండు ప్రాంతాల్లో ఒకే రోజు భూకంపాలు సంభవించాయి. లడఖ్‌లోని కార్గిల్‌లో ఈరోజు మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
షర్మిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో అభ్యంతర కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం కాంగ్రెస్ అధిస్టానం వరకు చేరింది. దీంతో రాహుల్ గాంధీ మద్దతు ఇస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలో ప్రతిపక్ష పార్టీల 'ఇండియా' కూటమికి సంబంధించి ఇంకా పొత్తులు ఖరారు కాలేదు. బీహార్‌లో నితీష్ కుమార్ నిష్క్రమణ కారణంగా ఈ ప్రతిపక్ష కూటమికి పెద్ద దెబ్బ తగిలినట్లైంది.
PM Modi : అసోంలోని గౌహతిలో రూ.11,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామాఖ్య మాత ఆశీస్సులతో ఈరోజు మరోసారి అసోం అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను మీకు అందజేసే భాగ్యం కలిగిందన్నారు.
సైన్యానికి యుద్ధ రంగంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ సాయంతో యూనిఫామ్‌లను సిద్ధం చేశారు. వీటిని పోలిన దుస్తుల విక్రయాలపై దాడులు మొదలయ్యాయి.
బీజేపీ సీనీయర్ నేత ఎల్.కె అద్వాణీకి భారతరత్న ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాసిక్‌లోని సిన్నార్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.