షర్మిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో అభ్యంతర కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం కాంగ్రెస్ అధిస్టానం వరకు చేరింది. దీంతో రాహుల్ గాంధీ మద్దతు ఇస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Rahul Gandhi: షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆమె చేస్తున్న ప్రసంగాలు కాక రేపుతున్నాయి. జగన్ అభిమానులకు చిర్రెత్తిస్తున్నాయి. దీంతో కొంత మంది జగన్ వీరాభిమానులు షర్మిలను సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో అభ్యంతర కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం కాంగ్రెస్ అధిస్టానం వరకు చేరింది. దీంతో రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Insulting and threatening women, a vile and cowardly act, is unfortunately the most common weapon of the weak.
The Congress Party and I stand firmly beside @realyssharmila ji and Suneetha Ji and strongly condemn this disgraceful attack.
షర్మిలపై జరగుతున్న సోషల్ మీడియా దాడిని రాహుల్ గాంధీ ఖండించారు.మహిళలను అవమానించడం, వారిపై మాటల దాడి చేయడం నీచమైన పనంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి పనిని కేవలం పిరికిపందలు చేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సోషల్ మీడియా వేదికగా దాడులు జరగడం, చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడంపై రాహుల్ గాంధీ స్పందించారు.
మహిళలను కించపరచడం, బెదిరించడం పిరికిపందల చర్య అని, దురదృష్టవశాత్తూ శక్తిహీనులకు ఇదొక ఆయుధంగా మారిందని రాహుల్ గాంధీ చెప్పారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సోషల్ మీడియాలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా అండగా నిలబడతానని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.