»Budget 2024 Bharat Rice In The Market Selling At Rs 29 Per Kg
Budget 2024: మార్కెట్లోకి భారత్ రైస్.. కేజీ రూ.29లకే విక్రయం
దేశంలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ రైస్ అనే పేరుతో కిలో బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.
Budget 2024: దేశంలో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈక్రమంలో వీటి లభ్యతను పెంచి ధరలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ అనే బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని రూ.29లకే విక్రయించాలని నిర్ణయించింది. సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా విక్రయించనున్నట్లు సమాచారం.
తృణధాన్యాల ధరలు పదిశాతం పైగా పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం 8.7 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం కట్టడికి, దేశంలో బియ్యం లభ్యతను పెంచేందుకు కేంద్రం భారత్ రైస్ పేరుతో సబ్సిడీ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు భారీ ఊరట లభించనుంది. ఈ రైస్‌ను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లు రిటైల్ ఔట్ లెట్ల ద్వారా అందించనున్నారు.