ఛత్తీస్‌గఢ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. తన బిడ్డ అంత్యక్రియల కోసం సాయం చేయాలని అభ్యర్థిస్తూ రెండురోజుల పాటు ఓ తల్లి ఇళ్లిళ్లూ తిరిగింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన కాంకేర్ జిల్లా మలంజికుండంలో చోటు చేసుకుంది. మన్సుగవాడే అనే మహిళకు లక్ష్మణ్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. రెండేళ్ల తర్వాత వారికి ఓ ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టాక మన్సుగవాడే అనారోగ్యానికి గురయింది. భర్త చికిత్స చేయించేందుకు ...
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. పార్టీ అత్యంత కీలక నేత తన పదవికి రాజీనామా చేసి, అధిష్టానానికి షాకిచ్చారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్ మంగళవారం ఆ పదవికి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, ఆయనతో కలిసి తాను పని చేయలేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం లేఖ రాసిన విషయం వెలుగు చ...
రాబోయే వాలంటైన్స్ డేను బహిష్కరించాలని విశ్వహిందు పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. లవర్స్ డేను బహిష్కరించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించాయి. వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదు. అది విదేశాల విష సంస్కృతి. అందుకే వాలంటైన్స్ డేను బహిష్కరిద్దామని వీహెచ్‌పీ జనరల్ సెక్రటరీ పండరినాథ్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14న పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను స్మరిద్దాం. ఈ రోజును అమర జ...
ప్రతి ఏటా విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2022లో 7,50,365 మంది భారతీయ విద్యార్థులు.. చదువు కోసం విదేశాలకు వెళ్లారని ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ వెల్లడించారు. గత 6 ఏళ్లల్లో మొత్తం మీద 30 లక్షల మంది విదేశాలకు వెళ్లినట్లు ప్రకటించారు. 2021లో 4,44,553 మంది విదేశాలకు వెళ్లిన విద్యార్థులతో పోలిస్తే 2022లో విదేశాలకు వెళ్లిన వ...
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే నిన్న కేంద్ర హోంత్రి అమిత్ షా బీజేపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోమతి జిల్లాలోని అమర్‌పూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. ఐదు అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిన మాజీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)తో పొత్తు క...
స్పీడుగా రైడ్ చేస్తున్న రెండు బైక్ లను చేయిలతో పట్టుకుని ఆపగలరా? కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. కానీ ఓ పోటీలో భాగంగా పంజాబ్ కు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ (24) అనే వ్యక్తి ఏకంగా నాలుగు బుల్లెట్ బైక్ లను ఆపాడు. అది కూడా మాములుగా కాదు. తాళ్లను నాలుగు ద్విచక్రవాహనాలకు కట్టి బైకర్లు వాటిని ముందుకు రైడ్ చేస్తుండగా లవ్ దీప్ చేతులతో పట్టుకుని ముందుకు వెళ్లనీయకుండా ఆపేశాడు. పంజాబ్ లుథియానా జిల్లాలో...
అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొని చాలా మంది బిల్డర్ల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రధాన నగరాల్లో అపార్టుమెంట్లలో బతికేవారే ఎక్కువగా ఉన్నారు. తమ సొంతింటిని సాకారం చేసుకునేందుకు వివిధ రంగాల్లో పనిచేసేవారు సేవింగ్స్ చేసి ఫ్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. తమ పిల్లలకు పేరెంట్స్ ఈ ఫ్లాట్లను బహుమతిగా కూడా ఇస్తుంటారు. అయితే ఫ్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత వారికి పలు రకాల ఇబ్బందులు అనేవి...
టర్కీని భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 7.8 గా భూకంపం నమోదైంది. ఈ భూకంప ధాటికి భవనాలు కుప్పకూలాయి. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కొన్ని వందల మంది ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా…. టర్కీ భూకంప ఘటనపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జ...
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వే ప్రయాణికులు తమ వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ పెట్టొచ్చు. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను ఇందుకోసం రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ చాట్‌బోట్‌పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేసి తమకు నచ్చిన ఆహారాన్ని...
బీహార్‌లో రైలు ఇంజిన్, బ్రిడ్జీ చోరి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా 2 కిలోమీటర్ల మేర పట్టాలను తీసుకెళ్లారు. ఈ ఘటన గత నెలలో జరిగింది. విచారణ జరిపితే ఇద్దరు ఉద్యోగుల పాత్ర ఉందని తెలిసింది. దీంతో వారిని విధుల నుంచి తప్పించారు. సమస్తిపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌ను దొంగిలించి స్క్రాప్ డీలర్‌కు విక్రయించారు. షుగర్ మిల్లుకు అనుసంధానం అయ్యే ట్రైన్ ట్రాక్ పై రాకపోకలు లేవు. దీంతో ...
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అది బ్యాంక్ ఉద్యోగిని ఒక కస్టమర్ చితకబాదిన వీడియో. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని లోన్ విషయంలో కస్టమర్ తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన బ్యాంక్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. నాదియడ్ బ్రాంచ్ అది. ఉద్యోగి తన పని తాను చేసుకుంటున్నాడు. తన సీటు దగ్గరికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఏం జరుగుతుందా అని తేరుకునే ...
ఓ వ్యక్తి రద్దీ మార్కెట్‌లో కత్తితో స్థానికులను బెదిరించాడు. వాళ్ల మీదికి.. వీళ్ల మీదికి దూసుకెళ్లబోయాడు. దీంతో అక్కడున్న వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చినా కూడా వాళ్లను కూడా కత్తితో బెదిరించాడు ఆ వ్యక్తి. కత్తి కింద పడేయాలని పోలీసులు ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ల మీదికి కూడా కత్తితో దూసుకెళ్లబోయాడు. దీంతో విసుగెత్తిన ఓ పోలీస్.. వెంటనే గన్ తీసి అతడ...
ప్రముఖ నేపథ్యగాయనీ వాణీ జయరామ్ మృతిపై మిస్టరీ వీడింది. ఆమెది సహజ మరణమేనని పోలీసులు తేల్చారు. బెడ్రూంలో గ్లాస్‌తో ఉన్న టీపాయ్‌పై వాణీ జయరాం పడిపోయారని వివరించారు. దీంతో తలకు తీవ్ర గాయమై చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలో ఇదే విషయం తేలిందని చెప్పారు. అపార్ట్ మెంట్ వద్ద సీసీ కెమెరా పరిశీలించామని వివరించారు. వాణీ జయరామ్ చనిపోయిన సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించలేదని పేర్కొన్నారు. ఆమె మృతి...
భారత సర్వోన్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు జడ్జీలు కొలువుదీరారు. దీంతో.. సుప్రీం న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 32కు చేరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు వ్యక్తి జస్టిస్ పులిగోరు వెంకట్ సంజయ్ కుమార్‌తో పాటూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా సుప...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై వివాదం సద్దుమణగడం లేదు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. మేయర్ పదవుల ఎన్నికకు తాజాగా సోమవారం మూడోసారి సమావేశం కాగా మళ్లీ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహంంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో ఈ పంచాయితీని తేల్చుకోవడానికి సిద్ధమైంది...