ప్రముఖ నేపథ్యగాయనీ వాణీ జయరామ్ మృతిపై మిస్టరీ వీడింది. ఆమెది సహజ మరణమేనని పోలీసులు తేల్చారు. బెడ్రూంలో గ్లాస్‌తో ఉన్న టీపాయ్‌పై వాణీ జయరాం పడిపోయారని వివరించారు. దీంతో తలకు తీవ్ర గాయమై చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికలో ఇదే విషయం తేలిందని చెప్పారు. అపార్ట్ మెంట్ వద్ద సీసీ కెమెరా పరిశీలించామని వివరించారు. వాణీ జయరామ్ చనిపోయిన సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించలేదని పేర్కొన్నారు. ఆమె మృతిపై సందేహాలు లేవని చెప్పారు. ఆమెది సహజ మరణమేనని తెలిపారు.
వాణీ జయరాం గత శనివారం చెన్నైలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే తలకు గాయం కావడంతో అనుమానాలు వచ్చాయి. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగింది. మృతికి గల కారణం తెలుసుకుంది. పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజీ చెక్ చేశారు. వాణీ జయరాం ముఖంపై బలమైన గాయాలు కనిపించాయి. రక్తపుమడుగులో నిర్జీవంగా పడి ఉండటంతో అనుమానాలు వచ్చాయి. పనిమనిషి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని తెలిపారు. ఒకటిన్నర ఇంచు లోతు గాయం అయిందని వైద్యులు తెలిపారు. గ్లాస్‌తో చేసిన టీపాయ్‌పై పడటంతో చనిపోయి ఉంటుంది. ఇదే విషయం ఫోరెన్సిక్ నివేదిక.. సీసీటీవీ ఫుటేజీ చూస్తే తెలుస్తున్నాయి.