బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైది సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైది ఇటీవల భారతదేశ మ్యాప్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో ఆయన మృతితో బంగ్లాదేశ్‌లో అర్ధరాత్రి నుంచి భారత వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. పలుచోట్ల నిరసనకారుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.