MBNR: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు రవాణా చేయాలని రెవెన్యూ అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 191 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వీటిని సంబంధించి రూ.219 కోట్లు ఖాతాల్లో వేసామన్నారు.