KRNL: ఆదోనిలో నకిలీ ఆధార్ కార్డులతో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా బయటపడింది. 23 ఏళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తి పేరుపై 2024లో డూప్లికెట్ ఆధార్ సృష్టించి, భూమి రిజిస్ట్రేషన్ చేయడం కలకలం రేపింది. బాధితులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. విచారణ చేసి న్యాయం చేస్తామని సబ్ రిజిస్ట్రార్ సునంద హామీ ఇచ్చారు.