సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అది బ్యాంక్ ఉద్యోగిని ఒక కస్టమర్ చితకబాదిన వీడియో. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని లోన్ విషయంలో కస్టమర్ తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన బ్యాంక్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. నాదియడ్ బ్రాంచ్ అది. ఉద్యోగి తన పని తాను చేసుకుంటున్నాడు. తన సీటు దగ్గరికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఏం జరుగుతుందా అని తేరుకునే లోపే ఆ ఉద్యోగిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. వెంటనే కొందరు కస్టమర్లు వెళ్లి వాళ్లను ఆపేందుకు ప్రయత్నించారు. బ్యాంక్ సిబ్బంది కూడా ఆపేందుకు ప్రయత్నించినా వాళ్లు ఆగలేదు. అతడిపై దాడి చేస్తూనే ఉన్నారు. బ్యాంక్ ముందు ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వచ్చి వాళ్లిద్దరినీ బయటికి లాక్కెళ్లేంత వరకు అతడిపై దాడి చేస్తూనే ఉన్నారు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే.. లోన్ విషయమై వాళ్లు.. బ్యాంక్ ఉద్యోగితో గొడవకు దిగినట్టు తెలుస్తోంది.
#WATCH | An employee of the Bank of India, Nadiad branch was thrashed by a customer over the issue of a bank loan on 3rd February. Case registered under SC-ST (Prevention of Atrocities Act) in Nadiad Town Police Station#Gujaratpic.twitter.com/JJbMzA2cOO