ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పైన ప్రకాశ్ రాజ్ విషం కక్కాడు. అదో చెత్త... ఈ సినిమా నిర్మాణం సిగ్గులేనితనమని తన ఆక్రోషాన్ని వెళ్లగక్కాడు. ఈ సినిమాపై ఇంటర్నేషనల్ జ్యూరీ ఉమ్మేసిందంటూ తన అసహనాన్ని వెళ్లగక్కాడు.
దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఈడీ(ED), సీబీఐ(CBI) అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను క్రమంగా అదుపులోకి తీసుకుంటూ మరికొంత మందిని అరెస్టు చేస్తున్నారు. బుధవారం(ఫిబ్రవరి 8న) ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న కాసేపటికే గౌత...
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 వస్తే చాలు ప్రేమికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరికొంత గులాబీలు ఇచ్చుకుంటూ ప్రపోజ్ చేసుకుంటారు. ఇంకొంత మంది అయితే సినిమాలు, షికార్లు అంటూ రకరకాలుగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ రోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. కానీ ఈసారి మాత్రం కొంచెం వినూత్నంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ప్రేమికులు గోవు...
గౌతమ్ అదానీతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నిసార్లు కలిసి ప్రయాణించారు? అతనిని మీరు ఎన్నిసార్లు కలిశారని తాను ప్రశ్నలు అడిగానని, కానీ లోకసభలో అంతసేపు మాట్లాడిన ప్రధాని తన ప్రశ్నలకు జవాబులు మాత్రం ఇవ్వలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని మోడీ జాతీయవాదం ముసుగులో దాక్కున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మోడీ పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పారన్నారు. పార్లమెంటులో అదానీ వ్యవహారంపై నరేంద్ర మోడీ మాట్లాడలేదన్నారు.
అమిత్ షాకి లేఖ రాసిన కోటంరెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగనే స్వయంగా తన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.
హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం అదానీ గ్రూపు షేర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని విపక్షాలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.
2004 నుండి 2014 కాలంలో కాంగ్రెస్(Congress) పాలనలో భారత్ అవినీతిమయమైందని, 2జీ స్కామ్ నుండి మొదలు పెడితే కామన్వెల్త్ స్కామ్ వరకు ఎన్నో వెలుగు చూశాయని ప్రధాని నరేంద్ర మోడీ లోకసభలో మండిపడ్డారు.
పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో అత్యంత ముఖ్యమైన శుభకార్యం. చావు అనేది అశుభం. అందుకే చావు జరిగిన చోట శుభకార్యాలు చేయరు. కానీ ఇక్కడ మాత్రం వేరేలా జరిగింది. శ్మశానంలో పెళ్లి జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటు సాక్షిగా స్పష్టతను ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని అమరావతి (Amaravati) అంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాతపూర్వక సమాధానం ఇచ్చింది. సెక్షన్ 5, 6 ప్రకారం రాజధాని ఏర్పాటు జరిగిందని గుర్తు చేసింది. అమరావతిని (Amaravati) రాష్ట్ర రాజధానిగ...
ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆర్థిక నిపుణులు ముందుగా ఊహించినట్లుగానే వడ్డీ రేట్ల పెంపుదలకే గవర్నర్ మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆరోసారి రెపోరేటు 25 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. దీంతో రేపో రేటు 6.50కు చేరుకుంది. చివరిగా గత ఏడాది డిసెంబర్లో ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుగగా ఆ సమయంలో 35 బేసిస్ పాయింట్లు పెంచారు. ద్రవ్యోల్బణం కట్టడి...
MBBS విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నీట్ పీజీ మెడికల్ కోర్సుల కోసం స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) ఇంటర్న్‌షిప్ కట్-ఆఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగించింది. దీంతో ఐదు రాష్ట్రాల నుంచి అదనంగా 13,000 MBBS విద్యార్థులు 2023 పరీక్షకు అర్హత సాధించారు. మొదట ప్రకటించిన ఇంటర్న్‌షిప్ కట్ ఆఫ్ తేదీ మార్చి 31, తర్వాత జనవరిలో జూన్ 30కి పొడిగించింది. ఆయా రాష్ట...
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. ఈ మేరకు గోరంట్ల బుచ్చిబాబును ఢిల్లీ సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢీల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో భాగంగా బుచ్చిబాబు పాత్ర ఉందని అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులోని అనుబంధ ఛార్జీషీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవ...
కోవిషీల్డ్ టీకా(covishield vaccine) తీసుకున్న వారికి హార్ట్ ఎటాక్(heart attack) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా(aseem malhotra) తెలిపారు. బ్రిటన్లో ఈ టీకా వేసుకున్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఇదే పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటుతోపాటు పక్షవాతం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు చిన్న,...
ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్.. పెద్ద నోట్లు రద్దు తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. యూపీఐ ద్వారా టీ స్టాల్, టిఫిన్ సెంటర్, చికెన్ సెంటర్.. ఒక్కటేమిటి అన్నీ చోట్ల స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ఫోన్ పేను ఎక్కువ ఉపయోగిస్తున్నారు. తన సేవలను ఫోన్ పే మరింత విస్తరించింది. విదేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకొంది. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూట...