రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వే ప్రయాణికులు తమ వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ పెట్టొచ్చు. ఇంటరాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను ఇందుకోసం రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ చాట్‌బోట్‌పై ప్రయాణికులు ఈ-కేటరింగ్, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేసి తమకు నచ్చిన ఆహారాన్ని కొనుగోలు చేయొచ్చు.
ఇప్పటికే కొన్ని రూట్లలో ఐఆర్సీటీసీ +91 8750001323 ఫోన్ నంబర్‌పై వాట్సాప్ ద్వారా మీల్స్ ను అందిస్తూ వస్తోంది. ఇకపై కేటరింగ్ సర్వీసులను కూడా వాట్సాప్ కమ్యూనికేషన్ అందుబాటులోకి తెస్తోంది. ఈ విషయాన్ని రైల్వే సోమవారం ప్రకటించింది. ఈ-కేటరింగ్ సర్వీసుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్సైట్ www.catering.irctc.co.in ద్వారా, ఈ-కేటరింగ్ యాప్ `ఫుడ్ ఆన్ ట్రాక్` ద్వారా భోజన వసతిని కల్పిస్తూ వస్తోంది. త్వరలోనే ఈ విధానం పూర్తిగా అమలు చేసేందుకు, రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది.