హైదరాబాద్(Hyderabad) ప్రజలకు రైల్వే శుభవార్త చెప్పింది. ఎంఎంటీఎస్(MMTs) సర్వీసులను విస్తరిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులిచ్చింది. రోజూ నగరవాసుల ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఎంఎంటీఎస్ సర్వీసుల(MMTS Services)ను పెంచేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నడుస్తున్న వాటికి అదనంగా మరో 40 ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది.
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మధ్య కొత్తగా 20 ఎంఎంటీఎస్ సర్వీసుల(MMTS Services)ను పెంచుతున్నట్లు వెల్లడించింది. అలాగే ఫలక్నుమా నుంచి ఉందానగర్ మధ్య మరో 20 రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఈ సర్వీసులు తక్కువగా ఉండేవి. సికింద్రాబాద్ మీదుగా ఫలక్నుమా వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లు ఉందానగర్ వరకూ సేవలను అందించనున్నాయి. దీంతో జంట నగరాల్లో ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య 106కి చేరినట్లు రైల్వే(Railway) ప్రకటించింది.