మార్కెట్ అంటే బండి నుంచి మొదలు సూపర్ మార్కెట్ వరకు ఉంటాయి. కొందరు సైకిళ్ల మీద తిరిగి విక్రయిస్తుంటారు. టూరిస్ట్ స్పాట్ థాయ్‌లాండ్‌లో మాత్రం వెరైటీ మార్కెట్ ఉంది. అవును రైల్వే ట్రాక్ పక్కన్ ఉండటమే విశేషం. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను ఓ సారి చూడండి.
థాయ్‌లాండ్‌లో ఫేమస్ మెక్లాంగ్ రైల్వేస్టేషన్. ఇది సముత్ సాంగ్ఖ్రామ్ ప్రావిన్స్‌లో ఉంది. రైల్వే ట్రాక్ పక్కన టాలట్ రొమ్ హప్ మార్కెట్ ఉంటుంది. దీనిని రిస్కీ మార్కెట్ లేద రైల్వే సైడ్ మార్కెట్ అని పిలుస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపారులు విక్రయిస్తుంటారు. రైల్వే ట్రాక్ పక్కనే వారు ఉంటారు. కూరగాయల పైనుంచి ఓ వైపు రైలు వెళుతుండటం వీడియోలో కనిపిస్తుంటుంది.
Maeklong Railway Market, Thailand 🇹🇭 a marketplace with a railway track through it 🛒@RebeccaH2030
మార్కెట్లో కూరగాయాలు, పళ్లు, చేపలు, రొయ్యలు లభిస్తాయి. రైళ్లు శబ్దం వినిపిస్తే చాలు కొనుగోలు దారులు దూరం జరుగుతారు. రైలు వచ్చే సమయంలో వ్యాపారులు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటారు. వీడియోనే నార్వే రాజకీయ నేత ఎరిక్ సొలియం ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 43 కే వ్యూస్ వచ్చాయి. ట్రాక్ వద్ద ఉన్న వస్తువులను కొనుగోలు చేస్తానని చెప్పలేనని ఒకరు కామెంట్ చేశారు. వ్యాపారుల నిర్లక్ష్యంగా ఉంటున్నారని, మరింత కఠిన చట్టాలు రావాల్సి ఉందన్నారు. కూరగాయాలు విక్రయించేందుకు ఉన్నాయి.. కానీ దానికి గ్రీజు ఉండొచ్చు అని రాశారు. కూరగాయాలకు ఇంధనం ద్వారా ఆశీర్వాదం వస్తోందని రాశారు.