TV Serial: టీవీ సీరియల్ (TV Serial) సెట్స్‌లోకి అనుకొని అతిథి ప్రత్యక్షమైంది. దాదాపు 200 మంది కలిసి షూటింగ్లో బిజీగా ఉండగా.. చిరుతపులి (Leopard) వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై నడిబొడ్డున జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
గోరెగావ్ ఫిల్మ్ సిటీ వద్ద మరాఠీ టీవీ సీరియల్ షూటింగ్లో అంతా బిజీగా ఉన్నారు. షూటింగ్ వర్క్ జరుగుతోంది. ఇంతలో చిరుతపులి (Leopard) వచ్చింది. దానిని చూసిన వారు బెంబేలెత్తిపోయారు. వెంటనే అక్కడి నుంచి పరుగు తీశారు. బయటకు వచ్చి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH | A leopard, along with its cub, entered the sets of a Marathi TV serial in Goregaon Film City, Mumbai yesterday.
All Indian Cine Workers Association president Suresh Shyamlal Gupta says, "More than 200 people were present at the set, someone could have lost life. This… pic.twitter.com/m1YgSXARl6
ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా చిరుతపులులు (Leopard) వచ్చాయని ఆల్ ఇండియ సినీ వర్కర్స్ అసోసియేషన్ చెబుతోంది. గత 10 రోజుల్లో నాలుగోసారి ఇలా రావడం అని గుర్తుచేసింది. షూటింగ్ సమయంలో 200 మందికి పైగా ఉన్నారని.. ఇలా రావడంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని చెబుతోంది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుంది. పొట్ట కూటి కోసం షూటింగ్ కోసం వస్తే.. ఇలా చిరుతపులులు (Leopard) రావడంతో బెంబేలెత్తిపోతున్నామని అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేశ్ శ్యామ్‌లాల్ గుప్తా తెలిపారు.