స్టార్ హీరో రామ్ చరణ్, తన భార్య ఉపాసన కామినేని వారి బిడ్డకు అమెరికాలో జన్మనివ్వబోతున్నట్లు వచ్చిన పుకార్లపై ఉపాసన క్లారిటీ ఇచ్చింది. అవన్నీ నిజాలు కాదని ఇండియాలోనే తాను చిన్నారికి జన్మనివ్వనున్నట్లు స్పష్టం చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారి రాజీనామాలను ఆమోదించారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం, మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ ప్రయోగాత్మకంగా My AI చాట్‌బాట్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇంకోవైపు ఇప్పటికే మెటా సంస్థతోపాటు జూమ్ కంపెనీ కూడా ఈ టెక్నాలజీని వారి సంస్థల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
74 medicine retail price finalise:జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థ (ఎన్‌పీపీఏ) 74 మందుల రిటైల్ ధరలను ఖరారు చేసింది. 109వ ఎన్‌పీపీఏ సమావేశంలో ధరలపై నిర్ణయం తీసుకుంది. వీటిలో కొన్ని ఎంపిక చేసిన మందులు ఉన్నాయి. మధుమేహ వ్యాధి చికిత్సలో వినియోగించే డాపాగ్లి ఫ్లోజిన్ సిటాగ్లిప్టిన్, మెట్‌ఫామిన్ హెచ్‌సీఎల్ (ఈఆర్) ట్యాబ్లెట్‌కు రూ.27.75 ధర నిర్ణయించారు.
తాజాగా ఉద్దవ్ థాకరేను మరింత కార్నర్ చేసేందుకు షిండే సరికొత్త ఎత్తుగడను వేశారు. శాసన మండలిలో శివసేన చీఫ్ విప్ గా విప్లవ్ బజోరయాను గుర్తించాలని కౌన్సిల్ డిప్యూటీ ఛైర్ పర్సన్ నీలమ్ గోర్హేకు ముఖ్యమంత్రి షిండే లేఖ రాశారు.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ మహిళ ఒక రాజకీయ నాయకుడి (political leader) కాలర్ పట్టుకొని, చెప్పులతో కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో సిద్ధార్థ్ నగర్ కి చెందినది. ఈ వీడియోలో ఓ మహిళ... నాయకుడి చొక్కా పట్టుకొని కొడుతోంది.
ts bjp leaders met amith shah:తెలంగాణ బీజేపీ నేతలు హస్తినలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీశ్ సిసోడియా (manish sisodia) అరెస్ట్ తర్వాత.. వారు దేశ రాజధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) ఆరోపణలు వచ్చాయి.
ప్రముఖ నటి అదితి రావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ కలిసి ఓ వైరల్ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు ప్రముఖులు ఆసక్తికరంగా కామెంట్లు చేశారు. అవెంటో తెలియాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
రాష్ట్రం, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తున్నదని నిలదీశారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానని ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. . ప్రకృతితో పాటు మానవుల రూపంలో వారికి అన్యాయం జరుగుతున్నది. పండించిన పంటను మార్కెట్ కు తీసుకువెళ్లితే ధర వెక్కిరిస్తోంది. ఆహార ధాన్యాలతో పాటు వాణిజ్య పంటలు, కూరగాయలకు ఈ పరిస్థితి ఎదురవుతున్నది.
Surf Excel:సర్ఫ్ ఎక్సెల్.. తెలుసు కదా.. సర్ఫ్, ఫేమస్ కూడా. అయితే ఈ బ్రాండ్ సేల్స్‌లో రికార్డు సృష్టించింది. గత ఏడాది బిలియన్ డాలర్ల సేల్స్ పూర్తిచేసుకుంది. ఇండియన్ హోమ్ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. రూ. 8200 కోట్ల విక్రయాలతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. హిందుస్థానీ యూనిలీవర్ సంస్థలో ఈ స్థాయిలో సేల్స్ జరిగిన తొలి బ్రాండ్ కూడా సర్ఫ్ ఎక్సెల్ కావడం విశేషం.
ఈశాన్య రాష్ట్రల్లో మళ్లీ కమలం వికసిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ( BJP) అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మేఘాలయ (Meghalaya) రాష్ట్రంలో మాత్రం బీజేపీకి చుక్కెదురు అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు ప్రధాని మోదీ (PM MODI) శుభవార్త అందించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెట్టుబడి సాయం 13వ విడత నిధులను సోమవారం విడుదల చేశారు. అర్హులైన 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.16,800 కోట్లు నిధులను నేరుగా పీఎం జమ చేశారు
సామాన్యులకు మళ్లీ షాక్ తగిలింది. కేవలం నెల రోజుల్లోనే వేరుశనగ నూనె(Peanut Oil) ధర మరోసారి పెరిగింది. లీటరుకు రూ.15 నుంచి రూ.20లకు చేరింది. ఫిబ్రవరి 26వ తేదికి వేరుశనగ నూనె(Peanut Oil) ధర లీటరుకు రూ.180కి చేరింది. పామాయిల్(Palm Oil) ధర చూసినట్లైతే లీటరుకు రూ.3 నుంచి రూ.5లకే పెరిగింది. దీంతో ప్రస్తుతం పామాయిల్(Palm Oil) ధర రూ.104లకు చేరింది. ఇకపోతే పొద్దుతిరుగుడు నూనె(Sunflower Oil) ధర లీటరకు రూ....
గుజరాత్‌లో వరుస భూకంపాలు(Earthquake) భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం రాజ్ కోట్ వద్ద భూకంపం(Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మరో రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు(Earthquake) జరగడంతో ప్రజలు భయాందోళన చెందారు.
భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ను కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు మమతా కుమారి, డెలినా కోంగ్డప్ లను కూడా నియమించారు. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.