»Telangana Bjp Leaders Met Central Home Minister Amith Shah
ts bjp leaders met amith shah:అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ.. కారణమిదేనా?
ts bjp leaders met amith shah:తెలంగాణ బీజేపీ నేతలు హస్తినలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీశ్ సిసోడియా (manish sisodia) అరెస్ట్ తర్వాత.. వారు దేశ రాజధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) ఆరోపణలు వచ్చాయి.
telangana bjp leaders met central home minister amith shah
ts bjp leaders met amith shah:తెలంగాణ బీజేపీ నేతలు హస్తినలో బిజీగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీశ్ సిసోడియా (manish sisodia) అరెస్ట్ తర్వాత.. వారు దేశ రాజధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) ఆరోపణలు వచ్చాయి. ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantal buchibabu) సీబీఐ అధికారులు (cbi) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత బీజేపీ నేత వివేక్ (vivek) హాట్ కామెంట్స్ చేశారు. తర్వాత కవిత (kavitha) అరెస్ట్ తప్పదని అన్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఆద్ ఆద్మీ పార్టీకి కల్వకుంట్ల కవిత రూ.150 కోట్లు (150 crores) ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలంతా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలువడం ఇంపార్టెన్స్ ఏర్పడింది.
వాస్తవానికి అమిత్ షా ఆఫీస్ (amith shah office) నుంచి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో వారంతా వెంటనే బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) సహా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy), లక్ష్మణ్ (laxman), డీకే అరుణ (dk aruna), రాజగోపాలరెడ్డి (rajagopal reddy) జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ (etala rajender), జితేందర్ రెడ్డి (jitender reddy), గరికపాటి మోహన్ (garikapati mohan), విజయశాంతి (vijayashanti), వివేక్ (vivek) తదితరులు అమిత్ షాను కలిసిన వారిలో ఉన్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (manish sisodia) అరెస్ట్ కావడం.. లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి నెలకొంది. ఇతర అంశాలపై రాష్ట్ర బీజేపీ నాయకులకు బీజేపీ అగ్ర నాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించుకుంది. ఇతర అంశాలపై కూడా డిస్కష్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ టెండర్లు (liquor tenders) కట్టబెట్టారనే నేపథ్యంలో మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై పలు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ 12 మందిని సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (gorantla buchibabu) , వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (magunta srinivasula reddy) కుమారుడు రాఘవ (raghava) ఉన్నారు.