స్టార్ హీరో రామ్ చరణ్, తన భార్య ఉపాసన కామినేని వారి బిడ్డకు అమెరికాలో జన్మనివ్వబోతున్నట్లు వచ్చిన పుకార్లపై ఉపాసన క్లారిటీ ఇచ్చింది. అవన్నీ నిజాలు కాదని ఇండియాలోనే తాను చిన్నారికి జన్మనివ్వనున్నట్లు స్పష్టం చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(ram charan), అతని భార్య ఉపాసన(upasana) కామినేని త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే గత వారం రామ్ చరణ్ హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అమెరికా(usa) వెళ్లారు. ఆ క్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్(jennifer ashton)తో చెర్రీ మాట్లాడారు. ఆ క్రమంలో ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసన కొన్ని రోజులు ఆమెరికా(america)లో ఉండబోతుందని ప్రకటించారు. ఆ టైంలో మీరు అందుబాటులో ఉంటే మంచిదని చెర్రీ ఆమెతో చెప్పగా..అందుకు జెన్నీఫర్ సానుకూలంగా స్పందించారు. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం తన అదృష్టమని..అందుకు తాను సిద్ధమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఉపాసన డెలివరీ(delivery) సమయంలో అమెరికాలో ఉంటుందనే ప్రచారం మొదలైంది. రామ్ చరణ్ దంపతులకు జన్మించే చిన్నారి(child)లో విదేశాల్లో జన్మింస్తుందనే పుకార్లు నెట్టింట వైరల్ గా మారాయి.
Dr Jen Ashton, ur too sweet. Waiting to meet you. Pls join our @HospitalsApollo family in India along with Dr Sumana Manohar & Dr Rooma Sinha to deliver our baby 🤗❤️
ఈ వార్తలపై స్పందించిన ఉపాసన కామినేని తాను ఇండియా(india)లోనే చిన్నారికి జన్మనివ్వబోతున్నట్లు ట్విట్టర్(twitter) వేదికగా ప్రకటించారు. మరోవైపు డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్(jennifer ashton) ను చాలా స్వీట్ అంటూ పలకరించారు. మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్నానని ఉపాసన(upasana) అన్నారు. దయచేసి మా @HospitalsApollo ఫ్యామిలీలో భాగమవ్వాలని కోరారు. మా బిడ్డకు ప్రసవం చేయడానికి డాక్టర్ సుమనా మనోహర్ & డాక్టర్ రూమా సిన్హాతో కలిసి భారతదేశంలో ఓ కుటుంబం ఎదురుచూస్తుందని తెలిపారు. దీంతో ఈ పుకారు వార్తలకు చెక్ పెట్టినట్లైంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకరు. ఒక దశాబ్దం క్రితం, ఈ జంట ఒక స్పోర్ట్స్ క్లబ్(sports club)లో కలుసుకున్నారు..చివరికి సంవత్సరాల తరబడి ప్రేమలో ఉన్న తర్వాత ఈ జంట డిసెంబర్ 2011లో నిశ్చితార్థం చేసుకున్నారు. చివరకు జూన్ 14, 2012న పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 10 సంవత్సరాల తర్వాత, ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. డిసెంబర్ 2022లో రామ్ చరణ్, ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి(mega star chiranjeevi) ప్రకటించారు.