74 medicine retail price finalise:74 మందుల రిటైల్ ధర ఖరారు
74 medicine retail price finalise:జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థ (ఎన్పీపీఏ) 74 మందుల రిటైల్ ధరలను ఖరారు చేసింది. 109వ ఎన్పీపీఏ సమావేశంలో ధరలపై నిర్ణయం తీసుకుంది. వీటిలో కొన్ని ఎంపిక చేసిన మందులు ఉన్నాయి. మధుమేహ వ్యాధి చికిత్సలో వినియోగించే డాపాగ్లి ఫ్లోజిన్ సిటాగ్లిప్టిన్, మెట్‌ఫామిన్ హెచ్‌సీఎల్ (ఈఆర్) ట్యాబ్లెట్‌కు రూ.27.75 ధర నిర్ణయించారు.
74 medicine retail price finalise:జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థ (ఎన్పీపీఏ) 74 మందుల రిటైల్ ధరలను ఖరారు చేసింది. 109వ ఎన్పీపీఏ సమావేశంలో ధరలపై నిర్ణయం తీసుకుంది. వీటిలో కొన్ని ఎంపిక చేసిన మందులు ఉన్నాయి. మధుమేహ వ్యాధి చికిత్సలో వినియోగించే డాపాగ్లి ఫ్లోజిన్ సిటాగ్లిప్టిన్, మెట్‌ఫామిన్ హెచ్‌సీఎల్ (ఈఆర్) ట్యాబ్లెట్‌కు రూ.27.75 ధర నిర్ణయించారు. రక్తపోటును అదుపు చేయటానికి వినియోగించే టెల్మిసార్టాన్, బిసోప్రొలోల్ ఫ్యూమరేట్ ట్యాబ్లెట్‌కు రూ.10.92 ధర నిర్ణయించారు. మరో 72 మందులకు గరిష్ఠ ధరను ఎన్పీపీఏ నిర్ణయించింది.
మూర్ఛ, నూట్రోపెనియా వ్యాధి ఔషధాలు ఇందులో ఉన్నాయి. సోడియమ్ వాల్ప్రొయేట్- 200 ఎంజీ ట్యాబ్లెట్‌కు రూ.3.20, ఫిల్గ్రాస్టిమ్ ఇంజెక్షన్ (ఒక వయల్)కు రూ.1,034.51 ధర నిర్ణయించారు. హైడ్రో కార్టిసోన్- 20 ఎంజీకి రూ.13.28 గరిష్ఠ ధర నిర్దేశించారు. వీటిలో బీపీ, షుగర్ మందుల వాడకం ఎక్కువ ఉంటుంది. రక్తపోటును బట్టి వైద్యుడు డోసు ఇస్తారు. రక్తంలో చక్కెర శాతం బట్టి మందులు లేదంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తుంటారు. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటేనే ఏదైనా సర్జరీ చేస్తారు. లేదంటే వాటిని కంట్రోల్ చేసి ఆపరేషన్ చేస్తుంటారు వైద్యులు.