ప్రధాని మోదీ పాలనతో అన్ని ధరలు పెరిగిపోయాయని మహిళలకు చెప్పారు. ఈ సందర్భంగా బస్సులో ఉన్న విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు.
ట్రెడ్ మిల్ పై నడుస్తూ వ్యాయామం చేశారు. సాధారణంగా ట్రెడ్ మిల్ పాటలు వింటూ చేస్తారు. కానీ మమతా బెనర్జీ ప్రత్యేకత చాటారు. తన ప్రత్యేక జాతికి చెందిన కుక్కను పట్టుకుని ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేశారు.
ప్రధాని మోదీ నిర్లక్ష్యం.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనంతో మణిపూర్ లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పరిస్థితులు సద్దుమణగలేకపోవడంతో అక్కడి వారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఢిల్లీలో లిక్కర్ స్కాం ఘటన మరువక ముందే తాజాగా ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో లిక్కర్ కుంభకోణం(liquor scam) వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఢిల్లీలో స్కాం కంటే ఇది పెద్దదని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ దందాలో ప్రధాన నిందితుడు ధేబర్ సహా పలువు అగ్ర రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ కేసులో ఉన్నట్లు ఈడీ చెబుతోంది.
కేరళ స్టోరీ(The Kerala Story) ఓ విషపూరిత ఉగ్రవాదాన్ని బట్టబయలు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp adda) అన్నారు. తుపాకులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో కూడిన ఉగ్రవాదం గురించి మనం విన్నాం. కానీ ఇది మరొక ప్రమాదకరమైన ఉగ్రవాదమని వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూసిన సందర్భంగా నడ్డా ఈ కామెంట్స్ చేయడం విశేషం.
కేరళలో (Kerala) ఘోర ప్రమాదం (Tragedy) చోటుచేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న డబుల్ డెక్కర్ పడవ (Boat) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏకంగా 22 మంది మరణించారు. మృతుల్లో అత్యధికంగా చిన్నారులు (Children) ఉండడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ సంఘటనపై ప్రధాని మోదీ (Modi), ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కూప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. అయితే విమానం పైలట్ మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం సూరత్‌గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. గత వారం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోగా తెలంగాణకు చెందిన ఓ టెక్నిషియన్ మృతి చెందారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని ...
ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan) ఆదివారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్(Video Release) చేశారు. తనపై ఒక్క లైంగిక ఆరోపణ రుజువైనా తాను ఉరేసుకుంటానని ప్రకటించారు.
బెంగళూరు(bangalore)లో ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) ఆదివారం రోజున తన మెగా రోడ్‌షోను ముగించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi) ఈ నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ క్రమంలో ఓ హోటల్‌కు చేరుకోవడానికి డెలివరీ బాయ్ స్కూటర్‌పై ఎక్కి ప్రయాణించారు. హెల్మెట్ పెట్టుకుని రాహుల్ బైక్ పై ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
40 శాతం కమీషన్ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారు. అవినీతి ప్రభుత్వాన్ని దహనం చేయడం మాత్రం గ్యారంటీ. తన పర్యటనతో ప్రధాని మోదీ బెంగళూరులో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
వీరి మద్దతుతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ వచ్చింది. అతి పెద్ద సామాజికవర్గం మద్దతు తెలపడంతో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీదే హవా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తోంది.
పంజాబ్ అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో శనివారం అర్ధరాత్రి ‘పేలుడు’ సంభవించింది. ఈ ఘటన జరిగిన తర్వాత అమృత్‌సర్‌లో భయాందోళనలు వ్యాపించాయి. అనేక మంది పర్యాటకులు, భక్తులు గాయపడ్డారు. పేలుడు ధాటికి గాజు ముక్కలు పగిలిపోవడం వల్లే గాయాలు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. సారాగర్హి సరాయ్ పార్కింగ్ దగ్గర నుంచి పేలుడు సంభవించింది. దీంతో ఐదు నుంచి ఆరుగురికి గాయాలయ్యాయి....