పంజాబ్ అమృత్‌సర్(amritsar)లోని స్వర్ణ దేవాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున మళ్లీ బాంబు పేలుడు(bomb blast) శబ్దం వినిపించింది. దాదాపు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ పేలుడు జరగగా, ఈ ఘటన కారణంగా ఐదుగురిని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
కర్ణాటక 2023 అసెంబ్లీ ఎన్నికల(Karnataka assembly Elections 2023)కు నిన్న ఓటింగ్ జరిగింది. అయితే రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం కర్ణాటకలో 72.67 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోజు తుది గణాంకాలు తెలుస్తాయని ఈసీ పేర్కొంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్(exit poll) సర్వేలు నిజమవుతాయో లేదో ఇప్పుడు చుద్దాం.
ఏడేళ్లుగా ఢిల్లీలో 30 మంది చిన్నారులను రవీంద్రకుమార్ హత్య చేశాడు. అతను మాదకద్రవ్యాలకు ఎక్కువగా అలవాటు పడ్డాడు, అశ్లీల చిత్రాలు చూడటం మరియు లైంగిక వేధింపుల కోసం పిల్లలను వెతుకుతూ, ఆపై వారిని చంపేవాడు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు పూర్తయింది. చాలా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కానీ కొన్న ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని కొల్లం పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ ఘర్షణలో గాయపడిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తీసుకొని వెళ్లారు. అయితే గాయానికి కట్టుకడుతున్న వైద్యురాలిని ఆ దుండగుడు కత్తెరతో పొడిచి చంపాడు. కుటుంబ సభ్యులు తనను కొట్టి చంపుతున్నారని, తనను కాపాడాలంటూ కొట్టారక్కర ప్రాంత పోలీసులకు బుధవారం ఉదయం ఫోన్ వచ్చింది.
నిన్న మొన్నటి దాకా అసెంబ్లీలోనే తిట్టుకోవడం కొట్టుకోవడం గురించి విన్నాం. కానీ ఇప్పుడు నాయకులు అప్ డేట్ అయినట్లున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ చితక బాదుకుంటున్నారు.
ఓ సోదరుడు(brother) తన చెల్లెలి విషయంలో దారుణానికి పాల్పడ్డాడు. రుతుక్రమం కారణంగా వచ్చిన రక్తాన్ని తప్పుగా భావించిన ఓ 30 ఏళ్ల సోదరుడు తన మైనర్ సోదరిని చిత్రహింసలకు గురిచేశాడు. అది శృంగారం ద్వారా వచ్చిన బ్లడ్ అనుకుని ఆమెను వేధించసాగాడు. దీంతో మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురైన ఆ మైనర్ బాలిక మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
హైదరాబాద్లో ఉగ్రకుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలతో నిన్న ఐదుగురిని ఏటీఎస్ పోలీసులు(ats police) అరెస్టు చేశారు. అయితే వారిని మధ్యప్రదేశ్ తీసుకెళ్లిన ప్రతినిధులు కీలక విషయాలను వెల్లడించారు. వీరంతా పెద్ద ప్లాన్ వేసినట్లు తెలిపారు.
కర్ణాటక 2023 అసెంబ్లీ(karnataka election 2023) ఎన్నికల ఓటింగ్(voting) ప్రక్రియ ప్రారంభమైంది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 2,430 మంది పురుషులు, 184 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు.
తాజాగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వివాదాస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story). విడుదలకు ముందు నుంచే సినిమాను థియేటర్ల(theatres)లోకి రాకుండా బ్యాన్(Ban) చేయాలని చాలా వర్గాలు ప్రయత్నించాయి. నిరసనలు, ఆందోళన నడుమ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.