»Sp Mla Thrashes Bjp Leader Husband In Police Station
Uttar Pradesh: పోలీస్ స్టేషన్లోనే చితక్కొట్టుకున్న బీజేపీ నేత భర్త, ఎస్పీ ఎమ్మెల్యే
నిన్న మొన్నటి దాకా అసెంబ్లీలోనే తిట్టుకోవడం కొట్టుకోవడం గురించి విన్నాం. కానీ ఇప్పుడు నాయకులు అప్ డేట్ అయినట్లున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ చితక బాదుకుంటున్నారు.
Uttar Pradesh: నిన్న మొన్నటి దాకా అసెంబ్లీ(Assembly)లోనే తిట్టుకోవడం కొట్టుకోవడం గురించి విన్నాం. కానీ ఇప్పుడు నాయకులు అప్ డేట్(Update) అయినట్లున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ చితక బాదుకుంటున్నారు. అది రోడ్డు అయినా సరే.. పోలీస్ స్టేషన్ అయినా సరే… ఎవరు చూస్తే మాకేంటి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా బీజేపీ(Bjp)కి చెందిన నాయకురాలి భర్తను సమాజ్ వాదీ పార్టీ(Samajwadi Party) ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో(police station)నే చితక్కొట్టాడు. ప్రస్తుతం వారు కొట్టుకున్న వీడియో వైరల్ అవుతుంది. పోలీసులు కొట్టుకుంటున్న వారిని నిలువరించేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. ఎమ్మెల్యే ఆ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశారు. ఎట్టకేలకు కాసేపటికి ఇరువురినీ పోలీసులు విడదీశారు. అనంతరం బాధితుడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
యూపీ(UP) అమేథీ జిల్లా(Amethi District)లో ఉన్న గౌరీగంజ్ కొత్వాల్ పోలీస్ స్టేషన్లో చెందిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేశారు. రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ సింగ్ పోలీసు స్టేషన్‌కు వస్తూ అక్కడ నిరసనలో తనను అసభ్యంగా తిట్టాడని, దీంతో తాను సహనం కోల్పోయి దాడి చేయాల్సి వచ్చిందని తెలిపారు. దీపక్ సింగ్ సహా అతని మద్దతుదారులు తన అనుచరుల్లో కొంతమందిపై దాడి చేసినందున తాను నిరసనకు దిగానన్నారు. పోలీసులకు చెప్పినా, ఎటువంటి చర్య తీసుకోలేదని రాకేష్ ప్రతాప్ సింగ్ వాపోయారు. నిరసన మధ్యే గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు దీపక్ సింగ్ చేరుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే(MLA)ని, అతని మద్దతుదారులను దుర్భాషలాడడం పెద్దగా వినిపించింది. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ పరిస్థితి అకస్మాత్తుగా చేయి దాటిపోయిందని, చూస్తుండగానే ఇరు నేతలు దాడిలో చిక్కుకున్నారని అన్నారు. సమస్య ఇప్పుడు పరిష్కరించబడిందని, ఇద్దరిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.