త్వరలో పోస్టాఫీసు మీ ఇంటికి పప్పులు, బియ్యంతో పాటు పిండి లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను డెలివరీ చేస్తుంది. ఇందుకోసం ఓఎన్‌సీడీ (Open Network For Digital Commerce) తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. ట్రేడర్స్ అసోసియేషన్ క్యాట్‌తో తపాలా శాఖ ఎంఓయూ కుదుర్చుకుంది.
చిన్ననాటి ఫ్రెండ్ నని అన్నాడు... నమ్మించాడు.. కనపడకుండానే 40వేల రూపాయలను కొట్టేశాడు. ఢిల్లీలోని ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ కు జరిగిన ఘటన ఇది. అయితే తాను హిప్నటైజ్(hipnotize) అవడం వల్లనే డబ్బును కోల్పోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) హైదారాబాద్ వచ్చే నెలలో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని ఈ రాష్ట్ర ప్రజలు తన కుటుంబంపై కురిపించిన ప్రేమను తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రియాంక ఇటీవల హైదరాబాద్ వచ్చిన క్రమంలో పేర్కొన్నారు. అంతేకాదు తన తల్లి సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఆ క్రమంలో ప్రియాంక కూడా మళ్లీ రాను...
హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసు(Hyderabad terror case) విచారణలో భాగంగా కీలక విషయాలు తెలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తితోపాటు ఉగ్ర కుట్ర కోసం నిందితులు మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసులో నిన్న మరొకరిని అరెస్ట్ చేశారు.
కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్ సమీపంలో ప్రభుత్వ బస్సు, కారు ఎదురెదురుగా వచ్చి ఆకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 9 మంది గాయాలయ్యాయి. కన్యాకుమారి జిల్లాకు చెందిన నృత్య, పాటల బృందం తిరుచెందూర్ సమీపంలోని ఆలయ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో నాగర్‌కోయిల్ నెల్లై జాతీయ రహదారిలోని వెల్లమడం ప్రాంతంలోని వంకలో అనూహ్యంగా ప్రభుత్వ బస్...
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ సింపుల్ వన్(Simple One Electric Scooter) మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 23న అధికారికంగా కస్టమర్లకు అందించనున్నారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కిలోమీటర్లు తిరుగుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక రోడ్లపైకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.
మోఖా తుఫాన్ ఈ అర్ధరాత్రికి తీవ్ర రూపం దాల్చనుంది. తుఫాన్ వల్ల అండమాన్ నికోబార్ దీవులు, బే ఆఫ్ బెంగాల్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, అసోంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఓ వ్యక్తికి ట్రాఫిక్ చలాన్లు (Traffic Challan) తిప్పలు తెచ్చి పెట్టాయి. ఏకంగా జైలు పాలు చేశాయి. కేరళకు ( Kerala ) చెందని ఓ వ్యక్తి హెల్ మెట్ పెట్టుకోకుండా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడు. దీంతో ట్రాఫిక్ సీసీ కెమెరాలు క్లిక్ మనిపించాయి. సదరు వెహికిల్ నెంబర్ అతని భార్య మొబైల్ కు యాడ్ అయి ఉండటంతో మెసేజ్ అతని భార్యకు వెళ్లింది. మెసేజ్ ను గమనించిన అతని భార్య … భర్త వెనక ఓ […]
కేంద్రంతో అధికారం కోసం సాగిన పోరులో ఢిల్లీ ప్రభుత్వాని(delhi government)కి భారీ విజయం దక్కింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పరిపాలన యొక్క నిజమైన అధికారం ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు(Supreme Court) వెల్లడించింది.
సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి ఎదురుదెబ్బ గోగ్వాలేని నియమించడం చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు శివసేన సంక్షోభం కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ స్పీకర్ పాత్రను నిర్ణయించనున్న విస్తృత ధర్మాసనం ఉద్ధవ్ స్వచ్ఛందంగా రాజీనామా చేసినందున MVA ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని SC చెప్పింది ఉద్ధవ్ మెజారిటీ కోల్పోయారని భావించి ఫ్లోర్ టెస్ట్‌కు ఆదేశించడాన్ని గవర్నర్ తప్పుబట్టారని సుప్రీంకోర్టు ...
ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) భారత్‌పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్(Ashneer Grover)పై 81 కోట్ల రూపాయల మోసానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేసింది. భారత్‌పే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్, ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు.
పసిపిల్లలు, పిల్లలతో రైలులో ప్రయాణించడం అంత సులభం కాదని మనందరికీ తెలుసు. వారితో ప్రయాణించేటప్పుడు వారు తమను తాము బాధించుకోకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు వారి వస్తువులను తీసుకువెళ్ళేటప్పుడు కూడా అదనపు జాగ్రత్త వహించాలి. ఈ క్రమంలో భారతీయ రైల్వే అలాంటి ప్రయాణికుల కోసం కొన్ని మార్పులు చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా లక్నోలో ప్రవేశపెట్టారు కూడా.