»The Supreme Court Is The Real Authority Of The Elected Government In Delhi Lg
Supreme Court: ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికే నిజమైన అధికారం
కేంద్రంతో అధికారం కోసం సాగిన పోరులో ఢిల్లీ ప్రభుత్వాని(delhi government)కి భారీ విజయం దక్కింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పరిపాలన యొక్క నిజమైన అధికారం ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు(Supreme Court) వెల్లడించింది.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP ప్రభుత్వాని(delhi government)కి అనుకూలంగా సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. నిజమైన అధికారం ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య నెలకొన్న న్యాయపరమైన వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును ప్రకటించింది.
ఢిల్లీ అసెంబ్లీ, ఎన్నికైన ప్రభుత్వం శాసన అధికారాలలో జోక్యం చేసుకునేందుకు ఎల్జీకి అధికారాలు ఉండవని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలో దేశ రాజధానిలో అడ్మినిస్ట్రేటివ్ సేవల నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా Supreme Court తీర్పు వచ్చింది.
2019 ఫిబ్రవరిలో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ దేశ రాజధానిలో పరిపాలనా సేవలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం అధికారాలపై విభజన తీర్పును వెలువరించింది. అయితే ఇది త్రిసభ్య ధర్మాసనానికి వెళ్లింది. మే 2022లో ఈ ప్రశ్నను రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నియంత్రణపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది.
సంవత్సరాల పోరాటం తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎట్టకేలకు హక్కు వచ్చిందని AAP నాయకుడు అతిషి అన్నారు.