రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కూప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. అయితే విమానం పైలట్ మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం సూరత్‌గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది.
గత వారం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోగా తెలంగాణకు చెందిన ఓ టెక్నిషియన్ మృతి చెందారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూలిపోయింది.
మరోవైపు ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో శిక్షణా వ్యాయామంలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్ 2000 కూలిపోవడంతో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోయారు.
ఏప్రిల్‌లో కొచ్చిలో ట్రయల్స్ సమయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చేయడంతో మరో ప్రమాదం జరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన రెండు సంఘటనలు నమోదయ్యాయి. ఇలా అనేక ప్రమాదాలు జరగడం పట్ల విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.