వర్షాల కారణంగా వచ్చిన తీవ్రమైన వరదల(floods) కారణంగా అనేక వీధులు జలమయంగా మారాయి. దీంతో గుజరాత్లో(gujarat)ని పలు ప్రాంతాల్లో ఉన్న కార్లతోపాటు పలు వాహనాలు నీటమునిగాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఉత్తరాఖండ్ చమోలీలోని అలకనంద నది ఒడ్డున ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో 15 మంది మృతి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అలకనంద నది ఒడ్డున జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ చమోలి పరమేంద్ర దోవల్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Uttarakhand: Policeman among 10 killed in Chamoli transformer explosion Read @ANI Story | https://t.co/en9...
ఈ ఏడాది తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు గురించి సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. సరికొత్త యాప్ రూపొందించి వారి ఖర్చులను అంచనా వేయనున్నారు.
గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తాజ్ మహల్ కట్టడంలోకి యమునా నది వరద నీరు చేరింది. అయితే వరద నీరు వల్ల తాజ్ మహల్ కు ఎటువంటి ముప్పు లేదని అధికారులు ప్రకటించారు.
తెలిసిన వ్యక్తి నుంచి వీడియో కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. బంధువు చికిత్స మేరకు 40 వేలు అప్పుగా అడగడంతో బాధితుడు అన్‌లైన్‌లో పంపాడు. తీరా చూస్తే అది ఫ్రాడ్ కాల్, ఏఐ టెక్నాలజీతో మోసం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇండియాలనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విస్తరించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పెద్ద మొత్తంలో లాభాలను నమోదు చేసింది. అంతే కాకుండా బ్యాంకు 30 శాతం నికర లాభాన్ని ఆర్జించింది.
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఓడించేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా 25కి పైగా పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో మహాకూటమి పేరు ఖరారైన ఈ పార్టీల సమావేశం జరుగుతోంది.