In the village, the couple who were drawing electricity every night were found red-handed
Bihar: ప్రేమ గుడ్డిది అనే నానుడి ఉంది. దీనికి తగ్గట్టుగానే ఓ ప్రేమజంట(LovePair) ప్రతిరోజు రాత్రి ఓ గ్రామం మొత్తాన్ని గుడ్డివాళ్లను చేస్తుంది. కేవలం వారి ఏకాంతం కోసం ఊరుమొత్తాన్ని చీకటిమయం చేస్తూ జల్సా చేస్తున్నారు. చివరికి దొరికారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో బేతియా జిల్లా నౌతన్ పోలీస్‌స్టేషను పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఆ పల్లెలో రోజూ రాత్రిపూట ఒకే సమయంలో కరెంట్ పోయేది. ఈ వ్యవహారం గత సంవత్సరం నుంచి ప్రతిరోజు జరుగుతోంది. ఇక సమయంలో రెండు బైక్‌లు, కరెంట్ మోటార్లు, పలు మేకలు కూడా మిస్ అయ్యాయి.
అనుమానం వచ్చిన గ్రామస్థులు మాటు వేసి.. అసలు దొంగలను పట్టుకున్నారు. గ్రామంలోని ఓ యువతి చేస్తున్న నిర్వాకమని తెలిసిపోయింది. ఆమె రోజూ తన ప్రియుణ్ని కలుసుకునేందుకు రాత్రిపూట ట్రాన్స్‌ఫార్మరు వద్దకు వెళ్లి విద్యుత్తును ఆపు చేసేది. తరువాత ప్రేమకలాపాలు జరిపేవారు. అలా ఏకాంతంలో మునిగి తేలుతున్న ప్రేమికులను గ్రామస్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువకుడికి దేహశుద్ధి చేసి వారిని పోలీసులకు అప్పగించారు. ఇక విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించడంతో ఆ విలేజ్ లో కరెంట్ సమస్య తీరింది.