దేశ వ్యాప్తంగా టమాటా ధరలు (Tomato prices) ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని చోట్ల కిలో టమాట ధర రూ.250 నుంచి రూ.300 వరుకు పలుకుతోంది.కానీ తాజాగా ఓ ఆటో డ్రైవర్ (Auto driver).. తన వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించారు. ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఫ్రీగా ఇస్తామని తెలిపాడు.దేశ వ్యాప్తంగా గత కొన్నిరోజుల నుంచి టమాటాల ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో టమాటా ధరల పెరుగుదలపై ట్రోల్స్(Trolls), మీమ్స్ తెగ వైరల్‌గా మారాయి.
ఇటీవల ఓ ట్రావెల్ ఏజెన్సీ టికెట్లు బుక్ చేసుకుంటే టమాటాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఓ ఆటో డ్రైవర్.. తన వినియోగదారులకు బంపరాఫర్ (Bumper) ప్రకటించారు. ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఫ్రీగా ఇస్తామని తెలిపాడు.ఉచిత టమాటాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆటో వెనుక బాగంలో అంటించడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ‘‘నాకున్న ఏకైక ఆదాయమార్గం ఆటోనే. దీని ద్వారా ఇలాంటి సేవలు అందించడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది’’ అని తెలిపాడు. అలాగే, పాకిస్థాన్‌తో త్వరలో జరగబోయే క్రికెట్ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. చండీగఢ్(Chandigarh)లో ఐదు రోజులపాటు తన ఆటోలో ఉచిత ప్రయాణం అందిస్తానని వెల్లడించాడు.