బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి రిషి సునాక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఆయా దేశాల నేతలకు నోరూరించే రుచులతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్3 ఫోటోలను చంద్రయాన్2 తీసింది. ఈ సందర్భంగా జాబిల్లిపై ఉన్న చంద్రయాన్3 ల్యాండర్ ఫోటోలను ఇస్రో సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.
ఐఐటీ బాంబేలో చదువుతున్న విద్యార్థులు రికార్డు సృష్టించారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 16 మందికి రూ.కోటికి పైగా ప్యాకేజీ లభించింది.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సెప్టెంబర్ 9న ఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు స్వాగతం పలికారు. జపాన్ ప్రధానితో సమావేశం ముగిసిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తన ట్విటర్లో ఓ చిత్రాన్ని పంచుకున్నారు.
దేశానికి వచ్చే అతిథుల నుంచి పేదలను, జంతువులను ప్రభుత్వం దాస్తోందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. భారతదేశ వాస్తవికతను మన అతిథుల నుండి ప్రభుత్వం దాచాల్సిన అవసరం లేదు.
ప్రజాప్రతినిధులు పుట్టిన రోజుల వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో అందరికి తెలిసిందే. అయితే ఈ ఎమ్మేల్యే మాత్రం అందుకు భిన్నంగా జరుపుకున్నారు. పామును మెడలో వేసుకొని తన బర్త్‌డేను జరుపుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.
ఆఫ్రికన్ యూనియన్(African Union)కు జీ20 దేశాల కూటమిలో శ్వాశత సభ్యత్యం ఇచ్చినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు కలిసి జీ20గా 1999లో ఏర్పాటయ్యాయి.ఆ తర్వాత ఈ కూటమిలో ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించలేదు. జీ20 సమావేశాలు (G20 meetings) శని, ఆదివారాల్లో న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ మాట్లాడుతూ, అందరితో కలిసి (Sabka Sa...
ప్రపంచాధినేతలను ఆహ్వానించేందుకు ప్రధాని నరేంద్రమోదీ భారత మండపానికి చేరుకుని స్వాగతం పలికారు
జీ20 సదస్సులో భాగంగా మొదట భారత్ మండపం వద్దకు ప్రపంచ దేశాల నేతలను ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఆ తర్వాత జరుగుతున్న కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
ఓ వ్యక్తి తమ ప్రాంతంలో వర్షం కురవకపోవడానికి గల కారణం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్3 అనుకున్నాడు. వెంటనే దేవుడితో మాట్లాడి వర్షాలు ఎందుకు కురవడం లేదో కనుక్కోవాలని ప్రభుత్వానికి లేఖ రాశాడు.
యూరప్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఓ అంతర్జాతీయ మీడియాతో భారత్‌కు సంబంధించిన పలు విషయాలను చర్చించారు. మోడీ ప్రభుత్వం గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. జీ20 సదస్సుకు విపక్షనేతను పిలవకపోవడం కరెక్ట్ కాదన్నారు.
భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు. అందులో భాగంగా నేడు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఐటీసీ మౌర్య హోటల్‌లో ఆయన బసచేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈడీ అధికారులు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరికొందరిని విచారిస్తున్నారు.
ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మరో భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్యాయన్ తర్వాత గగన్ యాన్ ప్రాజెక్ట్ చేపట్టనుంది. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.