జీ20 సమావేశాల్లో భాగంగా భారత్ విచ్చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) సతీసమేతంగా ఢిల్లీలోని అక్షర్ థామ్ ఆలయాన్ని సందర్శించారు. అక్షతామూర్తి(Aksathamurthy)తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. రిషి సునాక్ దంపతులు అక్కడ సుమారు గంటమేర గడపనున్నారని సమాచారం. రాఖీ పండుగ (Rakhi festival) ఘనంగా జరుపుకున్నానని రిషి సునాక్ ఇటీవలే తెలిపారు.
అయితే, శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకునేందుకు తనకు తీరిక దొరకలేదని విచారం వ్యక్తి చేసిన ఆయన, ఇందుకు బదులుగా అక్షరధామ్ దేవాలయాన్ని (Akshardham temple) సందర్శిస్తానని ఇటీవల మీడియాతో చెప్పారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, తాను హిందువైనందుకు గర్విస్తానంటూ బ్రిటన్ (Britain) ప్రధాని రిషి సునాక్ గతంలో పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ‘‘నేను హిందువై పుట్టినందుకు గర్విస్తున్నాను. మా తల్లిదండ్రులు నన్ను అలాగే పెంచారు’’ అని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు రిషి సునాక్ దంపతులు శుక్రవారం ఢిల్లీ(Delhi)కి వచ్చారు. నిన్నంతా రిషి జీ20 నేతలతో బిజీబిజీగా గడిపారు.